Beauty Care: ఫేస్ కాంతివంతంగా కనిపించాలని రకరకాలు ట్రై చేస్తుంటాం. ఆ ప్యాక్ అని ఈ ప్యాక్ అని ఏవేవో అప్లై చేస్తాం. అవి అప్పటికే ఫలితం చూపిస్తాయి. మీ ముఖం ఎక్కువ రోజులు గ్లోయింగ్‍గా కనిపించాలంటే ఈ 5 పువ్వులు చాలు. ఎప్పటికీ యవ్వనం పదిలంగా ఉంటుంది.
బ్యూటీ కోసం పార్లర్స్ అవసరం లేదు. మీ కళ్లముందే, మీ ఎదుటే కనిపించే ప్రకృతి చాలు. వాటి వల్ల మీకు హాయితో పాటు మీ అందం కూడా రెట్టింపు అవుతుంది. అవే నండి మీ పెరట్లో పూసే పూవ్వులు. మీ జుట్టు, చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందులో ఈ 5 పువ్వులైతే సహజంగా మీ అందాన్ని పెంచుతాయి. మీరు యవ్వనంగా కనిపిస్తారు. నాజూగ్గా ఉండి మెరిసిపోతారు.
26
మందారం (Hibiscus)
మందార వల్ల లాభాలు తెలిస్తే వదలరు. ముఖానికైనా, చర్మానికైనా, ఆరోగ్యానికైనా బెస్ట్ ఛాయిస్. మందార పువ్వు జుట్టుకు, చర్మానికి రెండింటికీ చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని కాపాడతాయి. వృద్ధాప్య ఛాయలు తగ్గిస్తాయి. ఇది జిడ్డు చర్మాన్ని నియంత్రించి, చర్మ రంధ్రాలను టైట్‌గా మార్చడంలో కూడా సహాయపడుతుంది.
36
బంతి పువ్వు (Calendula)
బంతి పువ్వును ఒక సహజమైన హీలర్‌గా చెబుతారు. దీనిలోని యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు చర్మంపై ఉన్న మురికిని, బ్యాక్టీరియాను తొలగిస్తాయి. ఇది మచ్చలు, ఎరుపుదనం, చర్మపు చికాకును తగ్గించి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. దీన్ని మెత్తగా నూరి చర్మానికి రాసుకోవచ్చు. రిజల్ట్ మీకే కనిపిస్తుంది.
చామంతి పువ్వు చర్మపు మంట, సన్‌బర్న్‌ను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వాపును తగ్గించి, స్కిన్ టోన్‌ను తేలికగా, శుభ్రంగా మారుస్తాయి. చామంతి టీ తయారు చేసి, కాటన్ సాయంతో చర్మానికి అప్లై చేసుకోవచ్చు.
56
మల్లె పువ్వు (Jasmine)
మల్లె పువ్వు చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది. వాపు, ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు కాలుష్యం, సూర్య కిరణాల నుంచి చర్మాన్ని కాపాడతాయి. ఇది చర్మాన్ని మెరిసేలా చేయడంలో, మొటిమల మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.
66
విచ్ హాజెల్ (Witch Hazel)
విచ్ హాజెల్ పెద్ద చర్మ రంధ్రాలు, జిడ్డు చర్మానికి చాలా మంచిది. ఇది ఒక సహజమైన టోనర్‌లా పనిచేస్తుంది. చర్మాన్ని టైట్‌గా, శుభ్రంగా ఉంచుతుంది. దీన్ని నీటిలో మరిగించి టోనర్‌గా ఉపయోగించవచ్చు.