Hair Care:జుట్టును జాగ్రత్తగా చూసుకోవడం అంటే ఖరీదైన షాంపూలు, కండిషనర్లు వాడటం కాదు. కొన్ని అలవాట్లను మార్చుకోవాలి. మరీ ముఖ్యంగా మనం తెలిసీ తెలియక చేసే కొన్ని తప్పులే... హెయిర్ ని ఎక్కువగా డ్యామేజ్ చేసేస్తాయి.
ఒత్తైన, పొడవాటి జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీని కోసమే అనేక రకాల షాంపూలు, ఆయిల్స్, సీరమ్స్, హెయిర్ మాస్క్ లు వాడుతూ ఉంటారు. అయితే, ఈ ప్రయత్నాలన్నీ చేసినా కూడా కొందరికి జుట్టు విపరీతంగా రాలిపోవడం, పొడిబారడం, బలహీనమవ్వడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మనం చేసే చిన్న చిన్న తప్పుల కారణంగానే హెయిర్ డ్యామేజ్ అవుతుందని మీకు తెలుసా? ఎలాంటి తప్పులు చేయకపోతే.. జుట్టు అందంగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం....
25
కండిషనర్ వాడటం...
జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండటానికి కండిషనర్ వాడటం చాలా మంచి పద్దతి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, చాలా మందికి కండిషనర్ సరిగా ఎలా వాడాలో తెలీదు. షాంపూ పూసేసినట్లుగా.. తలకు కూడా పూసేస్తారు. దీని వల్ల హెయిర్ ని ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. తొందరగా ఊడిపోవడానికి కారణం అవుతుంది. కండిషనర్ ఎప్పుడూ కేవలం జుట్టు చివర నుంచి మధ్య భాగం వరకు మాత్రమే రాయాలి.
టవల్ తో జుట్టు తుడవడం...
తలస్నానం చేసిన తర్వాత చాలా మంది జుట్టు త్వరగా ఆరిపోవాలని టవల్ తో గట్టిగా రుద్దుతూ ఉంటారు. దీని వల్ల జుట్టు చాలా ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. బలహీనంగా కూడా మారుతుంది. తొందరగా ఊడిపోవడానికి కారణం అవుతుంది. కాబట్టి.. టవల్ తో బలంగా జుట్టును తుడవకూడదు. కాటన్ అసలే వాడకూడదు. మైక్రోఫైబర్ టవల్ తో నెమ్మదిగా తుడిస్తే.. ఎక్కువ డ్యామేజ్ ఉండదు.
35
వేడి నీటితో తలస్నానం చేయడం...
చాలా మంది వేడి నీటితో తలస్నానం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో చలి తట్టుకోలేక.. వేడి నీటిని ఎంచుకుంటారు. కానీ వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల.. జుట్టులోని సహజంగా ఉండే ఆయిల్స్ కోల్పోయేలా చేస్తుంది. దీని వల్ల జుట్టు పొడిగా, బలహీనంగా మారుతుంది. బదులుగా గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం మంచిది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది జుట్టుకు నూనె రాయడం మర్చిపోతున్నారు. కానీ, వారానికి కనీసం రెండుసార్లు నూనె రాయడం అవసరం. కొబ్బరి నూనె, బాదం నూనె, ఆముదం నూనె ఏది ఎంచుకున్నా... గోరువెచ్చగా చేసి.. తలకు మంచిగా మసాజ్ చేయాలి. అప్పుడే జుట్టు అందంగా మారుతుంది.
55
5. హెయిర్ మాస్క్ వాడకపోవడం
చాలా మంది హెయిర్ మాస్క్ లు వాడటాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ, హెయిర్ మాస్క్ లు వాడటం జుట్టును అందంగా మారుస్తాయి. అలా అని మార్కెట్లో దొరికే కెమికల్స్ తో ఉన్న వాటిని వాడకూడదు. దానికి బదులు... సహజంగా అవకాడో, పెరుగు, తేనె, కలబంద, కొబ్బరి నూనె ఇలాంటి పదార్థాలతో హెయిర్ మాస్క్ లు ఇంట్లోనే తయారు చేసుకొని జుట్టుకు రాసుకుంటే.. హెయిర్ డ్యామేజ్ ఉండదు.