Face Glow: ఈ నూనె రెండు చుక్కలు రాసినా... ముఖం పై ముడతలు మాయం..!

Published : Nov 04, 2025, 01:23 PM IST

Face Glow: విటమిన్ ఇ మనకు చాలా ఈజీగా మార్కెట్లో లభిస్తుంది. ఈ విటమిన్ ఇ నూనెను.. కేవలం రెండు చుక్కలు ముఖానికి రాసి, మంచిగా మసాజ్ చేయడం వల్ల శరీరం హైడ్రేట్ గా మారుతుంది. చర్మం ఆరోగ్యంగా మారుతుంది. 

PREV
15
Face Glow

అందాన్ని పెంచుకోవాలనే కోరిక లేని వాళ్లు ఎవరైనా ఉంటారా? కానీ, అందం విషయంలో చాలా మందికి అపోహ ఉంటుంది. ఖరీదైన క్రీములు, ఫేషియల్స్ వాడాలని అనుకుంటారు. కానీ.. అవేమీ లేకుండా.. ఎక్కువ ఖర్చు లేకుండా కూడా అందాన్ని పెంచుకోవచ్చు. దాని కోసం ముఖానికి ఏం రాయాలో ఇప్పుడు తెలుసుకుందాం...

25
విటమిన్ ఇ తో ప్రయోజనాలు...

విటమిన్ ఇ ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టాల నుంచి రక్షిస్తుంది. ఈ నూనె రాయడం వల్ల ముఖం చాలా తేమగా, మృదువుగా మారుతుంది. చర్మాన్ని లోపలి నుంచి మెరుగుపరుస్తుంది.

35
విటమిన్ ఇ ముఖానికి ఎలా ఉపయోగించాలి...?

రాత్రి పడుకునే ముందు మీ ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా విటమిన్ ఇ తీసుకొని.. అందులో కలబంద జెల్ కలిపి మంచి మిశ్రమం లా తయారు చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి సున్నితంగా రాసి, మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం తాజాగా మెరుస్తూ కనపడుతుంది. మీరు వారంలో 3-4 సార్లు ఇలా చేయడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. యవ్వనంగా కనపడతారు.

పొడి చర్మం సమస్య ఉంటే...

మీకు పొడి చర్మం సమస్య ఉంటే... విటమిన్ ఇ క్యాప్సిల్ లోని నూనె తీసుకొని..దానిని బాదం నూనెలో లేదా కొబ్బరి నూనె తో కలిపి మంచి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. రాత్రి పడుకునే ముందు రాసి.. ఉదయానికి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మీ పొడి చర్మం సమస్య తగ్గుతుంది. మృదువుగా కూడా కనపడుతుంది.

45
విటమిన్ ఇ నూనె తో ప్రయోజనాలు....

1 ముడతలు తగ్గుతాయి....

విటమిన ఇ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. దీని వల్ల వృద్ధాప్యం ఆలస్యం అవుతుంది. ముడతలు తగ్గుతాయి. ఫైనల్ లైన్స్ తగ్గిపోతాయి. యవ్వనంగా కనిపిస్తారు.

2.చర్మ రంగు మెరుగుపడుతుంది....

రోజువారీ కాలుష్యం, సూర్య కిరణాలు చర్మం కాంతిని తగ్గిస్తాయి. విటమిన్ ఇ నూనె చర్మం రంగును సమంగా ఉంచి, మచ్చలను తగ్గించి, సహజ కాంతిని తిరిగి తెస్తుంది. సహజంగా ముఖంలో గ్లో పెరుగుతుంది.

పిగ్మెంటేషన్, నల్ల మచ్చలను తగ్గిస్తుంది:

విటమిన్ ఇ నూనె చర్మ కణాలను పునరుత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఇది మచ్చలు, పిగ్మెంటేషన్‌ను తగ్గించి, చర్మం స్మూత్‌గా కనిపించేలా చేస్తుంది.

మొటిమల తర్వాత మిగిలే మచ్చలను తొలగిస్తుంది:

కొంతమంది మొటిమల వల్ల మచ్చలు లేదా డార్క్ స్పాట్స్‌తో బాధపడతారు. విటమిన్ ఇ నూనె ఈ మచ్చలను తగ్గించి, చర్మం మళ్లీ సాఫ్ట్‌గా మారేలా చేస్తుంది.

చర్మానికి తేమను అందిస్తుంది:

ఇది సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. పొడిగా ఉన్న చర్మానికి తక్షణ హైడ్రేషన్ ఇస్తుంది. చర్మం తేమను ఎక్కువ సేపు నిలుపుకుంటుంది.

55
తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

విటమిన్ ఇ నూనెను నేరుగా చర్మంపై అధిక మెత్తాదులో అప్లై చేయకండి. ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. అంతేకాదు.. ఆయిల్ స్కిన్ ఉన్నవారు.. ఈ నూనెను ఎక్కువగా ఉపయోగించరాదు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు రాసుకుంటే సరిపోతుంది.

ఫైనల్ గా...

విటమిన్ ఇ నూనెను నిరంతరం ఉపయోగించడం ద్వారా మీరు 40 ఏళ్ల వయస్సులో కూడా యవ్వనంగా కనిపించవచ్చు. ఇది చర్మాన్ని లోపల నుంచి పునరుజ్జీవింపజేస్తుంది. మృదువుగా, కాంతివంతంగా మార్చుతుంది. కాస్మెటిక్ ఉత్పత్తులపై ఆధారపడకుండా, సహజంగా ఈ నూనెతో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories