రష్మిక మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో రష్మిక మాట్లాడిన మాటలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఆమె వ్యక్తిత్వం చాలా గొప్పది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రపంచానికి ఆమె సినిమాలు, డైలాగులు, ప్రేమకథలు, ఎంగేజ్మెంట్, బ్రేకప్ వంటి అంశాలు మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ, తెర వెనక ఆమె.. గొప్ప మనుసున్న వ్యక్తి అని ఈ వీడియో ద్వారా అర్థమౌతోంది.
మనం తరచూ ఇతరుల గురించి విన్నదాని ఆధారంగా అభిప్రాయాలు ఏర్పరుచుకుంటాం. కానీ ప్రతి ఒక్కరి, జీవితంలో మనకు తెలియని బాధలు, పరిస్థితులు, కారణాలు ఉంటాయి. అవి మనకు కనిపించకపోయినా, వాళ్లు వాటిని ఎదుర్కుంటూనే ఉంటారు. అందుకే, రష్మిక చెప్పినట్లు.. మనం ఎవరికైనా మరొక సమస్యగా మారకూడదు. వాళ్ల ముఖంలో చిరనవ్వు తీసేయకుండా, చిన్న సానుభూతితో, మంచితనంతో వ్యవహరించాలి.