Periods: పీరియడ్స్ లో నొప్పి భరించలేకపోతున్నారా? ఇవి తింటే నొప్పి మటుమాయం..!

Published : Jul 08, 2025, 06:07 PM IST

చాలా మంది పీరియడ్ పెయిన్ భరించలేక మందులు వాడుతూ ఉంటారు. కానీ, వాటి అవసరం లేకుండా కూడా నొప్పి నుంచి ఉపశమనం పొందచ్చు.

PREV
15
పీరియడ్ పెయిన్ తగ్గించేదెలా?

అమ్మాయిలను పీరియడ్స్ ప్రతి నెలా పలకరిస్తూనే ఉంటాయి. ఈ పీరియడ్స్ వస్తూ వస్తూ.. భరించలేని నొప్పిని కూడా మోసుకువస్తాయి. ఆ నొప్పి తట్టుకోవడం అంత సులభం ఏమీ కాదు. ఆ నొప్పితో రోజువారీ పనులు చేసుకోవడం మరింత కష్టంగా ఉంటుంది. చాలా మంది నొప్పి భరించలేక ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. కానీ.. ఆ మందులతో పని లేకుండా కూడా నొప్పిని తగ్గించుకోవచ్చు. అది కూడా సహజంగా లభించే కొన్ని రకాల ఆహారాలు తింటూ ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. ఎలాంటి ఫుడ్ తింటే పీరియడ్ పెయిన్ నుంచి బయటపడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం...

25
1.అరటిపండు..

పీరియడ్స్ సమయంలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే, నొప్పిని తక్కువ చేసే ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చడం ద్వారా మంచి ఉపశమనం పొందొచ్చు. మొదటగా చెప్పుకోవాల్సింది అరటి పండు. ఈ పండు మనకు చాలా చౌకగా అందరికీ అందుబాటులో ఉంటుంది. ఏ సీజన్ లో అయినా దొరుకుతుంది. పీరియడ్స్ సమయంలో ఈ పండు తింటే నొప్పి నుంచి ఉపశమనం పొందచ్చు. దీనిలో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి కడుపు ఉబ్బరాన్ని, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. శక్తివంతంగా కూడా ఉంచుతుంది.

శొంటి..

పీరియడ్స్ నొప్పి తగ్గించడంలో శొంటి చాలా బాగా సహాయపడుతుంది. దీనినే డ్రై జింజర్ అని కూడా అంటారు. దీని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వాపులు, నొప్పులు తగ్గించడంలో కీలకంగా ఉంటాయి. పీరియడ్స్ సమయంలో శొంటిని టీగా తీసుకోవచ్చు లేదా పొడి రూపంలో తీసుకోవచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది.

35
ఆకుకూరలు..

పీరియడ్స్ సమయంలో కచ్చితంగా తీసుకోవాల్సిన మరో ముఖ్యమైన ఆహారం ఆకుకూరలు.మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా లభించే ఆకుకూరలు (పాలకూర, తోటకూర వంటి వాటి) శరీరంలోని రక్తహీనతను తగ్గించడంలో ఉపయోగపడతాయి. పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం జరిగితే, ఐరన్‌ను తిరిగి సమతుల్యం చేయడంలో ఇవి సహాయపడతాయి.

అలాగే హోల్ గ్రెయిన్స్ (వోట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్) మంచి ఫైబర్ సోర్స్ మాత్రమే కాదు, బీ విటమిన్లు, మెగ్నీషియం లాంటి ఖనిజాలతో నిండి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తూ, కండరాల ఒత్తిడిని తగ్గించి, మలబద్ధక సమస్యను కూడా పరిష్కరిస్తాయి.

45
పైనాపిల్..

అరటి పండు మాత్రమే కాదు.. మరో పండు కూడా పీరియడ్స్ లో మీకు నొప్పి నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. అదే పైనాపిల్. ఇందులో ఉన్న ఎంజైములు సహజ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో పీరియడ్ నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ ఫలాన్ని జ్యూస్ రూపంలో లేదా ముక్కలుగా తీసుకోవచ్చు.

ఒక అద్భుతమైన హెల్తీ ట్రీట్ — డార్క్ చాక్లెట్. దీనిలో మగ్నీషియం మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఇది మూడ్‌ని లిఫ్ట్ చేయడంలోను, కండరాల నొప్పిని తగ్గించడంలోను సహాయపడుతుంది. కానీ దీనిని మితంగా మాత్రమే తీసుకోవాలి.

55
నీరు ఎక్కువగా తాగడం..

అంతేకాక, ఈ సమయంలో చాలా ముఖ్యమైనది..నీటిని ఎక్కువగా తాగడం. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం వల్ల bloating తగ్గుతుంది, శరీర వ్యర్థాలు బయటకు వెళ్లే ప్రక్రియ సులభంగా జరుగుతుంది. రోజు కనీసం 2.5 నుంచి 3 లీటర్లు నీరు తాగడం మంచిదే.

మొత్తం మీద, పీరియడ్స్ సమయంలో నొప్పిని సహజంగా నియంత్రించాలంటే, సరైన ఆహారాన్ని ఎంచుకోవడం ముఖ్యం. ట్యాబ్లెట్లు వేసుకోకుండానే, ఆరోగ్యకరమైన ఆహారంతో నొప్పిని తగ్గించుకోవచ్చు. ఇది నొప్పికి ఉపశమనం ఇవ్వడమే కాకుండా..శక్తి, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత అందించడంలోనూ దోహదపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories