Hair Care: కొబ్బరి నూనెలో ఇది కలిపి రాస్తే.. పొడవైన జుట్టు మీ సొంతం..!

Published : Jul 08, 2025, 01:37 PM IST

మెంతులు, కొబ్బరి నూనెతో కలిపి రాయడం వల్ల జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది.

PREV
15
పొడవైన జుట్టు కోసం..

పొడవైన జుట్టు కావాలని కోరుకునేవారు చాలా మంది ఉంటారు. కానీ.. ఈ రోజుల్లో పొడవైన జుట్టు పెంచుకోవడం అంటే అంత ఈజీ కాదు. దానికి సరైన జుట్టు సంరక్షణ చాలా అవసరం. ఒత్తైన, పొడవైన జుట్టుకు మనం వాడే కొబ్బరి నూనె కూడా చాలా ముఖ్యం. అలా అని.. రెగ్యులర్ గా దొరికే కొబ్బరి నూనె రాస్తే..మీరు కోరుకున్నట్లుగా జుట్టు ఉండకపోవచ్చు.అందుకే.. కొబ్బరి నూనెలో కొన్నింటిని కలిపి రాస్తే మాత్రం.. కచ్చితంగా ఒత్తైన జుట్టు సాధ్యం అవుతుంది. మరి, దీనికోసం కొబ్బరి నూనెలో ఏం కలిపి రాయాలో ఇప్పుడు చూద్దాం...

25
1.మెంతులు...

మెంతులు జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మెంతులు, కొబ్బరి నూనెతో కలిపి రాయడం వల్ల జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం కూడా..మెంతులు జుట్టు ప్రయోజనకరంగా పరిగణిస్తారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రచురించిన పరిశోధనలో కూడా మెంతులు జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటాయని తేలింది.మెంతులు తలకు అప్లై చేయడం వల్ల చుండ్రు, దురద వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

35
మెంతులతో హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలి?

100 మి.లీ కొబ్బరి నూనెలో 2 టీస్పూన్ల మెంతి గింజలు,కొన్ని కరివేపాకులను 10 నుండి 15 నిమిషాలు మరిగించండి. స్టవ్ నుండి నూనె తీసి చల్లబరచాలి. చల్లారిన తర్వాత నూనె వడగట్టి ఒక సీసాలో నింపాలి. ఈ నూనెను వారానికి రెండుసార్లు తలకు మంచిగా మసాజ్ చేయాలి. రాత్రి రాసుకొని.. ఉదయాన్నే తలస్నానం చేస్తే సరిపోతుంది.

ఈ నూనె రాయడం వల్ల కలిగే ప్రయోజనాలు...

జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తుంది

పొడి జుట్టు పొడిబారడాన్ని తగ్గించడానికి, కొబ్బరి నూనె ,మెంతి గింజలతో తయారు చేసిన ఈ నూనెను తలకు అప్లై చేయవచ్చు. ఇది నెత్తికి పోషణనిస్తుంది. జుట్టుకు పోషకాలు లభించడంతో, అది మృదువుగా ,పట్టులా మారుతుంది.జుట్టు బలం కూడా పెరుగుతుంది.

45
జుట్టు పెరుగుదలను పెంచుతుంది

కొబ్బరి నూనెలో లారిక్ ఆమ్లం ఉంటుంది, ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది. మెంతిలో ఉండే ప్రోటీన్, నికోటినిక్ ఆమ్లం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇది జుట్టు పొడవును పెంచడంలో సహాయపడుతుంది.

జుట్టు నెరయడాన్ని నివారిస్తుంది

జుట్టు అకాల నెరయడం సమస్య నుండి ఉపశమనం పొందడానికి, మీరు కొబ్బరి నూనె,మెంతి గింజలతో తయారు చేసిన ఈ హెర్బల్ ఆయిల్‌ను మీ జుట్టుకు అప్లై చేయవచ్చు. ఇది జుట్టు బలాన్ని పెంచడమే కాకుండా జుట్టు అకాల నెరయడాన్ని కూడా నివారిస్తుంది.

55
చుండ్రును తగ్గిస్తుంది

జుట్టులో చుండ్రు సమస్యను తగ్గించడంలో మెంతి ప్రభావవంతంగా ఉంటుంది. మెంతులు జుట్టు మెరుపును పెంచడంలో సహాయపడతాయి. మీరు మెంతులను నూనెలో కలిపి ఉపయోగించవచ్చు లేదా మెంతి ప్యాక్ తయారు చేసి మీ జుట్టుకు అప్లై చేయవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories