Hair Care: ఇవి రోజూ తింటే.. జుట్టు అసలు రాలదు..!

Published : Jul 07, 2025, 11:11 AM ISTUpdated : Jul 07, 2025, 11:41 AM IST

జుట్టు బాగా రాలిపోతుందని బాధపడుతున్నారా? అయితే, ఖరీదైన షాంపూలు వాడటం కాదు.. ఆహారంలో మార్పులు చేసుకోండి. ముఖ్యంగా బయోటిన్ ఉన్న ఆహారం తీసుకోవాలి. బయోటిన్ జుట్టు పెరుగుదలకు, మొత్తం ఆరోగ్యానికి ఒక ముఖ్యమైన విటమిన్.

PREV
16
ఇవి తింటే చాలు.. జుట్టు రాలదు..

ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. జుట్టు రాలడం మొదలవ్వగానే చాలా మంది హెయిర్ ఆయిల్స్, షాంపూలు మార్చేస్తూ ఉంటారు. కానీ, కేవలం ఖరీదైన షాంపూలు, నూనెలతో జుట్టు రాలే సమస్య తగ్గదు. మనం ఆహారం విషయంలో కచ్చితంగా మార్పులు చేసుకోవాలి. కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.అంతేకాదు... జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

బయోటిన్ జుట్టు పెరుగుదలకు, మొత్తం ఆరోగ్యానికి ఒక ముఖ్యమైన విటమిన్. దీనిని విటమిన్ బి7 లేదా విటమిన్ H అని కూడా పిలుస్తారు.బయోటిన్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. కుదుళ్లను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది. మరి, ఏం తింటే.. మన జుట్టు అందంగా మారుతుందో తెలుసుకుందామా...

26
1.కోడిగుడ్లు..

కోడిగుడ్డు ప్రోటీన్ కి మంచి సోర్స్. ఒక గుడ్డులో బయోటిన్ దాదాపు 10 మైక్రోగ్రాముల బయోటిన్ ఉంటుంది. గుడ్డులోని పచ్చసొనలో బయెటిన్ మాత్రమే కాకుండా, ఇతర పోషకాలు ఉంటాయి. జుట్టు పెరుగుదల కోసం మీరు ప్రతిరోజూ ఒకటి లేదా రెండు గుడ్లు తింటే సరిపోతుంది. ఇలా తినడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండటమే కాదు.. జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.

36
2.గింజలు, విత్తనాలు:

రెగ్యులర్ గా మీ డైట్ లో గింజలు, విత్తనాలు భాగం చేసుకోవాలి. బాదం పప్పు, వేరు సెనగ, వాల్ నట్, పొద్దుతిరుగుడు విత్తనాల్లో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. అవి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ప్రతిరోజూ అన్ని కలిపి ఒక గుప్పెడు వరకు తినవచ్చు. క్రమం తప్పకుండా రెండు వారాలు వీటిని తింటే.. మార్పు మీరే స్వయంగా చూస్తారు.

ఆకుపచ్చ ఆకుకూరలు:

పాలకూర, మునగ ఆకులు, తోట కూర వంటి ఆకుకూరలు బయోటిన్ , ఐరన్ తో సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి. మీ జుట్టు కుదుళ్లు బలపడతాయి. వీటిని రెగ్యులర్ గా అంటే వారానికి మూడుసార్లు అయినా తీసుకుంటే.. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

46
పాలు, పాల ఉత్పత్తులు:

పాలు, పెరుగు, పన్నీర్, చీజ్ మొదలైన వాటిలో బయోటిన్ , కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును బలోపేతం చేస్తాయి. పొడి చర్మం సమస్యలను తగ్గిస్తాయి. ప్రతిరోజూ ఒక కప్పు పాలు లేదా పెరుగు తినడం మంచిది. ఇవి జుట్టును అందంగా మారుస్తాయి.

చేపలు, సముద్ర ఆహారం:

సాల్మన్, ట్యూనా , రొయ్యల వంటి సముద్ర ఆహారాలలో బయోటిన్ , ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇవి తింటే జుట్టు రాలడం ఆగడమే కాదు.. జుట్టు అందంగా కనిపించేలా చేస్తుంది.

56
చిలగడదుంపలు..

చిలగడదుంపలు బయోటిన్‌ను మాత్రమే కాకుండా, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బీటా-కెరోటిన్‌ను కూడా కలిగి ఉంటాయి. అవి విటమిన్ ఎ కి మంచి సోర్స్. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

అరటిపండు:

అరటిపండ్లలో బయోటిన్, భాస్వరం , పొటాషియం ఉంటాయి, ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు అందంగా మారడానికి సహాయపడతాయి.

66
తృణధాన్యాలు:

గోధుమలు, ఓట్స్ వంటి తృణధాన్యాలు బయోటిన్, జింక్‌ను కలిగి ఉంటాయి, ఇవి జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలను అందిస్తాయి.

బయోటిన్ అధికంగా ఉండే ఆహారాన్ని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం జుట్టు పెరుగుదలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పైన పేర్కొన్న ఆహారాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా, మీరు మీ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఇది జుట్టు రాలడం, బలహీనతను తగ్గిస్తుంది. జుట్టు మెరిచేలా చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories