Beauty tips: ఇవి రాస్తే, లిప్ స్టిక్ అవసరం లేకుండానే పెదాలు ఎర్రగా మారతాయి..!

Published : Jun 26, 2025, 06:00 PM IST

శరీరంలో నీటి శాతం తగ్గిపోతే.. పెదాలు పొడిగా మారిపోతాయి. దీని కారణంగా, అవి డార్క్ కలర్ లోకి మారిపోతాయి.దాని వల్ల పెదాలు పిగ్మెంటెడ్ లిప్స్ గా కనిపిస్తాయి.

PREV
15
అందమైన పెదాల కోసం..

అందరికంటే తాము అందంగా కనిపించాలనే కోరిక దాదాపు అందరు అమ్మాయిల్లో ఉంటుంది. అలా అందంగా కనిపించాలి అంటే, మన ముఖంలో ఒక భాగమై పెదాలు కూడా అందంగా ఉండాలి. అవి ఎర్రగా లేదా గులాబీ రంగులో ఉంటే చూడటానికి ఎంత బాగుంటుంది. అలా కనిపించాలని మార్కెట్లో దొరికే కెమికల్స్ తో నిండిన లిప్ స్టిక్స్, లిప్ గ్లాస్ లాంటివి వాడుతూ ఉంటారు. అవి మన పెదాలను తాత్కాలికంగా మాత్రమే ఎర్రగా ఉంచుతాయి. ఆ తర్వాత వాటిలో ఉండే కెమికల్స్ పెదాలను మరింత నల్లగా మారుస్తాయి. మరి, అలా కాకుండా.. మీ పెదాలు సహజంగా అందంగా మెరవాలంటే కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు. మరి అవేంటో చూసేద్దామా..

25
మంచినీరు తాగడం..

మీరు చదివింది నిజమే.. మన శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచాలి. శరీరంలో నీటి శాతం తగ్గిపోతే.. పెదాలు పొడిగా మారిపోతాయి. దీని కారణంగా, అవి డార్క్ కలర్ లోకి మారిపోతాయి.దాని వల్ల పెదాలు పిగ్మెంటెడ్ లిప్స్ గా కనిపిస్తాయి. ఇక ధూమపానం చేసేవారి పెదాలు కూడా నల్లగా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు, కొన్ని రకాల లిప్ బామ్, లిప్ స్టిక్స్ లో ఉండే కెమికల్స్ పెదాల రంగును పాడు చేస్తాయి.

సూర్యుని అతినీలలోహిత కిరణాలకు ఎక్కువసేపు గురికావడం వల్ల పెదాలు నల్లగా మారొచ్చు. అలెర్జీలు లేదా మందుల దుష్ప్రభావాలు కూడా పెదవుల రంగులో మార్పులకు కారణమవుతాయి. కొన్ని యాంటీబయాటిక్‌లు ఈ సమస్యను కలిగిస్తాయి. అలాగే, శరీరంలో ఐరన్ లోపం పెదవుల రంగును మార్చగలదు.

కొన్నిసార్లు నల్లటి పెదవులు ఆరోగ్య సంబంధిత వ్యాధులకు సంకేతంగా కూడా ఉండవచ్చు. ఉదాహరణకు, అడిసన్స్ వ్యాధిలో, శరీరంలోని చర్మం , పెదవుల రంగు నల్లగా మారుతుంది. అదే సమయంలో, హిమోగ్లోబిన్ రుగ్మత కారణంగా రక్తం లేకపోవడం వల్ల పెదవులు నల్లగా మారుతాయి. కాలేయం సరిగ్గా పనిచేయకపోతే, అది పెదవుల రంగును కూడా ప్రభావితం చేస్తుంది.

35
హోం రెమిడీస్..

ఈ 4 పదార్థాలు మీ ముదురు పెదవులను ఒకే రోజులో గులాబీ రంగులోకి మార్చడానికి సరిపోతాయి

కావాల్సిన పదార్థాలు..

నిమ్మరసం

చక్కెర

కస్తూరి పసుపు

కొబ్బరి నూనె

ఒక గిన్నెలో, సగం నిమ్మరసం, సగం చెంచా చక్కెర, ఒక చెంచా పసుపు పొడి , కొబ్బరి నూనెను కూడా చేర్చి బాగా కలపాలి. తర్వాత ఈ పేస్ట్‌ను ఐదు నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత ఈ పేస్ట్‌ను మీ పెదవులపై అప్లై చేసి పది నిమిషాలు అలాగే ఉంచి, ఆపై మీ పెదాలను నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల మీ పెదాలు ఎర్రగా మారి కనపడతాయి.

45
కొబ్బరి నూనె , నిమ్మకాయ

కొబ్బరి నూనె పెదవులను హైడ్రేట్ చేస్తుంది. అందంగా కూడా మారుస్తుంది. ఇదే కొబ్బరి నూనెకు నిమ్మకాయ రసం కూడా కలిపితే పెదాల నల్లటి రంగు క్రమంగా తొలగిపోతుంది. కొబ్బరి నూనెను నిమ్మరసంతో కలిపి రాత్రి పడుకునే ముందు పెదాలపై రాయండి. అలాగే, గులాబీ రేకులు, తేనె మిశ్రమం లిప్స్ కి సహజ తేమను అందిస్తుంది. గులాబీ రేకులను తేనెతో కలిపి పెదాలపై 10-15 నిమిషాలు అప్లై చేయండి. తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.

బీట్‌రూట్

బీట్‌రూట్ రసం సహజ రంగును ఇస్తుంది. ఇది మీ పెదాలను గులాబీ రంగులోకి మార్చడంలో సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల నలుపు రంగు తగ్గుతుంది. తాజా బీట్‌రూట్ రసం తీసుకొని రాత్రి పడుకునే ముందు మీ పెదవులపై అప్లై చేయండి. కలబంద జెల్ కూడా మీ పెదాలను ఎర్రగా మార్చడంలో సహాయపడతాయి. రోజుకు రెండుసార్లు మీ పెదాలపై కలబంద గుజ్జు అప్లై చేయండి

55
నిమ్మకాయ, తేనె

నిమ్మకాయ, తేనె మిశ్రమం నల్లటి పెదాల సమస్యకు చక్కని పరిష్కారం అని చెప్పొచ్చు . ఒక టీస్పూన్ తేనెను కొన్ని చుక్కల నిమ్మరసంతో కలిపి మీ పెదాలపై 10 నిమిషాలు అప్లై చేయండి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనిని రెగ్యులర్ గా ప్రయత్నిస్తే, మంచి ఫలితాలు చూస్తారు

టమాట..

టమాటాలలో విటమిన్ సి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇది అనేక చర్మ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది.

దీనితో పాటు, సూర్యుని హానికరమైన కిరణాల నుండి పెదాలను రక్షించే గుణం కూడా వీటికి ఉంది. సగం టమోటా తీసుకొని పేస్ట్ లా చేసి, ఈ పేస్ట్ ని పెదాలపై అప్లై చేసి పది నిమిషాలు అలాగే ఉంచండి. మీ రోజువారీ ఆహారంలో టమోటాలను ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories