Women Secrets: ఒక మహిళ ముఖం చూసి.. వారి స్వభావం ఎలా ఉంటుందో ఈజీగా చెప్పేయచ్చని మీకు తెలుసా? సాముద్రిక శాస్త్రం ప్రకారం ముఖంలో ఉండే ప్రత్యేకమైన గుర్తుల ద్వారా వారి రహస్యాలను బయటపెట్టేయచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
జోతిష్య శాస్త్రం ఆధారంగా జాతకం ఎలా తెలుసుకోవచ్చో.. ఈ సాముద్రిక శాస్త్రం ఆధారంగా భవిష్యత్తు తెలుసుకోవచ్చు. మరీ ముఖ్యంగా, సాముద్రిక శాస్త్రం ప్రకారం… ఒక మహిళ పెదాలు, కనుబొమ్మలు, గడ్డంపై ఉండే సొట్టలను బట్టి, వారి వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం…
23
పెదాలు ఎలా ఉన్నాయి..?
మీ పెదాలు పలచగా, ఎర్రగా ఉండే పెదాలు ఉన్న మహిళలు కుటుంబం, భర్త పట్ల చాలా దయతో ఉంటారు. వీరికి సంతోషకరమైన వైవాహిక జీవితం ఉంటుంది. అదే పెదాలు మందంగా, నల్లగా ఉంటే వారి జీవితం సమస్యలతో నిండి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.
గడ్డంపై సొట్ట ఉంటే…
గడ్డంపై సొట్ట ఉన్న మహిళలు ఉల్లాసంగా, నమ్మకంగా ఉంటారు. వీరు చాలా దయగల స్వభావం కలిగి ఉంటారు. గుండ్రని గడ్డం ఉన్న మహిళలను అదృష్టవంతులుగా భావిస్తారు. వీరు జీవితంలో చాలా సంతోషాన్ని పొందుతారు.
33
మహిళల కనుబొమ్మలు రహస్యాలను వెల్లడిస్తాయి
మహిళల కనుబొమ్మలను చూసి కూడా వారి గురించి చాలా విషయాలు చెప్పొచ్చు. కనుబొమ్మలు విల్లు ఆకారంలో ఉంటే, వారు మంచి స్వభావం కలవారని నమ్మకం. అదే కనుబొమ్మలు పొడవుగా, మందంగా లేదా విరిగినట్లుగా ఉంటే, వారు కఠిన స్వభావం కలవారని అంటారు. రెండు కనుబొమ్మలు కలిసిపోయి ఉంటే, వారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని భావిస్తారు.