Nita Ambani: నీతా అంబానీ శారీ నేయడానికి ఎన్నేళ్లు పట్టిందో తెలుసా? చీర స్పెషాలిటీ ఇదే

Published : Apr 23, 2026, 03:48 PM IST

Nita Ambani: నీతా అంబానీ ఎప్పుడూ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటూ ఉంటారు. సంప్రదాయం, ట్రెండీ కలయికతో ఫ్యాషన్ ఐకాన్‌గా నిలిచారు. 'న్యూయార్క్‌ టైమ్స్‌ 100 సమ్మిట్‌'లో దేశీ లుక్‍లో మెరిశారు. దీంతో ఆమె ధరించిన చీర నేపథ్యం గురించే మాట్లాడుకుంటున్నారు. 

PREV
17
గ్లోబల్ ఐకాన్ నీతా అంబానీ

కోట్లకు అధిపతి అయినా ఎప్పుడూ సింపుల్‍గానే కనిపిస్తారు నీతా అంబానీ. ఆమె ఎక్కువగా భారతీయ చేనేత వస్త్రాలకు ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా ఆమె ధరించే కాంజీవరం, పటౌలా,  బనారసీ చీరలు భారతీయ నేత కళాకారుల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతాయి. ఆమె స్టైల్ ఎప్పుడూ హుందాగా ఉంటుంది.

ఎంతటి పెద్ద వేదికపై ఉన్నా, నుదుటన బొట్టు, చేతులకు గాజులతో కనిపిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్రాండ్లను ధరిస్తూనే, వాటికి తనదైన ఒక క్లాసీ టచ్ ఇస్తారు. ఆమె ధరించే ప్రతి వస్తువు వెనుక ఒక కథ ఉంటుంది. 

27
నీతా అంబానీ

నీతా అంబానీ కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, ఒక స్టైలిష్ ఐకాన్ కూడా. ఆమె ధరించే ప్రతి డ్రెస్ భారతీయ సంస్కృతి, హస్తకళలను ప్రతిబింబిస్తుంది. ఈసారి కూడా తన చీరకట్టుతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.

37
న్యూయార్క్‌ టైమ్స్‌ 100 సమ్మిట్‌

ఇటీవల నీతా అంబానీ 'న్యూయార్క్‌ టైమ్స్‌ 100 సమ్మిట్‌'లో పాల్గొన్నారు. పాశ్చాత్య ఫ్యాషన్ హంగుల మధ్య, ఆమె కట్టుకున్న భారతీయ చీర అందరినీ ఆకట్టుకుంది. 

47
జమ్‌దానీ చీర ప్రత్యేకత

నీతా అంబానీ ధరించింది.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సంప్రదాయ జమ్‌దానీ చీర. దీనిని బిరన్ కుమార్ బసక్ డిజైన్ చేశారు. ఈ చీరపై ఆవులు, మహిళలు, పావురాలు, చెట్లు వంటి ఎన్నో ఆకృతులు ఉన్నాయి. గిరిజన జీవితం, ప్రకృతి అన్నీ ఈ చీరలో ప్రతిబింబించేలా రూపొందించారు.

57
చీర తయారీ సమయం

ఈ జమ్‌దానీ చీరను బిరన్ కుమార్ బసక్ పూర్తిగా చేతితో నేశారు. దీన్ని పూర్తి చేయడానికి ఆయనకు 24 నెలలు, అంటే సరిగ్గా రెండేళ్లు పట్టింది. ఫ్యాషన్ వారానికోసారి మారిపోయే ఈ రోజుల్లో, ఒక చీర కోసం ఇంత సమయం కేటాయించడం విశేషం.

67
చేప గుర్తు

నీతా అంబానీ చీర కొంగుపై చేప బొమ్మ ఉంది. ఇది కేవలం డిజైన్ మాత్రమే కాదు, సంపదకు, అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ఇలాంటి సాంస్కృతిక అంశాలు ఈ చీరను మరింత ప్రత్యేకంగా మార్చాయి.

77
నీతా అంబానీ దేశీ అవతార్

ఈ చీరలో నీతా అంబానీ చాలా సింపుల్‌గా, అందంగా కనిపించారు. నుదుట బొట్టు, ఫ్రీ హెయిర్‌తో ఆమె దేశీ లుక్‍తో అబ్బురపరిచారు. తన అందంతో ప్రపంచాన్ని ఆకట్టుకోవడంలో నీతా మరోసారి సక్సెస్ అయ్యారు.

చీరకే ఎక్కువ గ్రాండ్ లుక్ ఉండటంతో, నీతా అంబానీ తక్కువ నగలనే ఎంచుకున్నారు. ముత్యాల హారం, పచ్చల చెవిపోగులు, పచ్చ పొదిగిన గాజులు, ఉంగరాలతో తన లుక్‌ను పూర్తి చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories