నాన్ స్టిక్, స్టీల్, స్టెయిన్ లెస్ స్టీల్ ఇలా మనం వంటింట్లో ఎన్నో రకాల గిన్నెల్ని, సామాన్లను వాడుతుంటాం. కానీ కొన్ని రకాల సామాన్లు మన ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. కాబట్టి వంటకు వేటిని ఉపయోగించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది అల్యూమినియం పాత్రలను ఎక్కువగా వాడుతుంటారు. ఎందుకంటే ఇవి చాలా రోజుల వరకు వస్తాయి. వీటి మన్నిక ఎక్కువ. అందులోనూ వీటి ధర చాలా తక్కువ. వీటిని వాడటం చాలా ఈజీ. అందుకే వీటిని చాలా మంది ఉపయోగిస్తారు.
26
అల్యూమినియం గిన్నెల దుష్ప్రభావాలు
అల్యూమినియం గిన్నెల్లో వంట ఈజీ కావొచ్చు. కానీ ఈ గిన్నెలె కాలక్రమేణా పనికిరాకుండా అవుతాయి. ముఖ్యంగా ఇవి మనం తినే ఆహారంలో కలిసిపోతాయి. వీటిలో వండిన ఫుడ్ ను తిని మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే పాత అల్యూమినియం గిన్నెలను వాడకూడదు.
36
నాన్ స్టిక్ పాన్లు
ఈ రోజుల్లో నాన్ స్టిక్ పాన్ ల వాడకం బాగా పెరిగిపోయింది. ఇవి ఆయిల్ ను చాలా తక్కువగా తీసుకుంటాయి.. అలాగే ఫుడ్ కూడా బాగా కుక్ అవుతుంది. అందుకే వీటిని చాలా మంది వాడుతుంటారు. కానీ వీటిని ఎలా పడితే అలా యూజ్ చేస్తే వీటి పూత దెబ్బతింటుంది.
నాన్ స్టిక్ పాన్ లపై టెఫ్లాన్ అనే పూత ఉంటుంది. దీనిని ఎక్కువ వేడి చేసి ఫుడ్ ను వండితే ఆ పూత వదులవుతుంది. దీంతో ఈ పాన్ నుంచి విష వాయువులు వెలువడతాయి. దీంతో మనం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
56
ప్లాస్టిక్ పాత్రలు
వంటింట్లో మనం ఎన్నో రకాల ప్లాస్టిక్ పాత్రలను వాడుతుంటాం. కానీ ప్లాస్టిక్ పాత్రలను వాడటం మంచిది కాదు. ఎందుకంటే ప్లాస్టిక్ లో బిస్ఫెనాల్ ఎ ఉంటుంది. దీనిలో వేడి ఫుడ్ ను వేస్తే ఇది ఫుడ్ లో కలిసిపోతుంది.
66
జాగ్రత్తగా ఉండాలి
అందుకే వంటింట్లో ప్లాస్టిక్ పాత్రలను వాడకపోవడమే మంచిది. ఏండ్లుగా ఉన్న ప్లాస్టిక్ పాత్రలను బయటపారేయడం మంచిది. ముఖ్యంగా ప్లాస్టిక్ పాత్రల్లో వేడి వేడి ఫుడ్ ను వేయకూడదు.