చాలా మంది గ్యాస్ స్టవ్ దగ్గరే వంట నూనెను పెడుతుంటారు. కానీ నూనెను స్టవ్ దగ్గర మాత్రం పెట్టకూడదు. దీనిని ఎప్పుడూ కూడా వేడి, వెలుతురు లేని ప్లేస్ లోనే పెట్టాలి.
Image credits: Getty
Telugu
మసాలా దినుసులు
కొంతమంది మసాలా దినుసులను కూడా గ్యాస్ స్టవ్ దగ్గరే పెట్టేస్తుంటారు. ఇలా వేడి దగ్గర పెట్టడం వల్ల మసాలా దినుసుల రుచి, ఆకృతి మారుతాయి.
Image credits: Getty
Telugu
పండ్లు
పండ్లను కూడా గ్యాస్ స్టవ్ దగ్గర్లో పెట్టే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ స్టవ్ వేడికి పండ్లు తొందరగా పాడవుతాయి. అందుకే పండ్లను స్టవ్ దగ్గర్లో పెట్టకూడదు.
Image credits: Getty
Telugu
వినెగర్
వినెగర్ ను ఎప్పుడూ కూడా వేడి ప్రదేశాల్లో నిల్వ చేయకూడదు. దీన్ని ఎప్పుడైనా సరే ఎక్కువ వెలుతురు లేని, చల్లగా లేని ప్రదేశాల్లోనే నిల్వ చేయాలి.
Image credits: Getty
Telugu
మాంసం, చేప
చేపలను, మాంసాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉండే ప్లేస్ లో పెట్టకూడదు. దీనివల్ల కూరలు తొందరగా పాడవుతాయి.
Image credits: Getty
Telugu
కాఫీ పొడి
కాఫీ పొడిని పొరపాటున కూడా స్టవ్ దగ్గర పెట్టకండి. ఎందుకంటే కాఫీ పొడి వేడి, తేమ వల్ల తొందరగా పాడవుతుంది.
Image credits: Getty
Telugu
పాలు, గుడ్లు
వేడిగా ఉండే ప్రదేశంలో పెడితే పాలు, గుడ్లు తొందరగా పాడవుతాయి. కాబట్టి గ్యాస్ స్టవ్ దగ్గర వీటిని పెట్టకూడదు.