Jasmine: రాత్రిపూట ఆడవాళ్లు మల్లెపూలు పెట్టుకుంటే ఏమౌతుంది?

Published : Mar 19, 2026, 01:39 PM ISTUpdated : Mar 19, 2026, 02:11 PM IST

Jasmine: ఆడవారికే కాదు చాలా మందికి మల్లెపూల సువాసన చాలా ఇష్టం. అసలే ఎండాకాలంలో మల్లెపూలు విపరీతంగా పుస్తాయి. ప్రతి ఇంట ఆడవాళ్లు ఈ మల్లెపూలు పెట్టుకుని మురిసిపోతారు. మరి మల్లెపూల వల్ల మెదడులో ఏం జరుగుతుందో తెలుసా? 

PREV
16
పెళ్లి అయినా, పండగైనా గంపలకొద్దీ మల్లెపూలు ఉండాల్సిందే

సమ్మరనే కాదు ఏకాలంలోనైనా అన్నీరకాల పూవులు దొరుకుతాయి. అందులోనూ మల్లెపూలకు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు. ఫ్లవర్స్ అంటే ఇష్టముండని ఆడవాళ్లు ఉంటారా, ఇంకా మల్లెపూలంటే చెప్పనక్కర్లేదు. పెళ్లి అయినా, పండగైనా గంపలకొద్దీ మల్లెపూలు ఉండాల్సిందే. సంచులకొద్దీ తెప్పిస్తారు. ఆ వాసనకు కొందరైతే మైమరిచిపోతారు. అందుకే ఫస్ట్ నైట్ రోజు కూడా ఈ మల్లెపూలనే అలంకరిస్తారు. 

26
మల్లెపూలను తలలో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా?

సమ్మర్‍లో అయితే మల్లెపూలు విరగపూస్తాయి. ప్రతి ఇంట్లో మల్లె మొక్క ఉండాల్సిందే. సాయంత్రమైతే చాలు అమ్మలక్కలంతా కలిసి ఈ మల్లెపూలు గుచ్చుకుని తలలో పెట్టుకుంటారు. ఆ స్మెల్ కోసం గుప్పెడైనా పెట్టుకోవాలని ఆశపడతారు. మల్లెపూలకు అంత కథ ఉంది. అలాంటి మల్లెపూలను తలలో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా?

36
మల్లెపూలు పెట్టుకుంటే బోలెడు లాభాలు

పూర్వం నుంచి మల్లెపూలు పెట్టుకోవడం ఒక ఆచారంగా ఉంది. అందుకే పెరట్లో పెంచుకునేవారు. ఇప్పుడంటే జడలే వేసుకోవడం లేదు, ఇంక పూవ్వులేం పెంటుకుంటారు. కానీ మల్లెపూలు పెట్టుకుంటే బోలెడు లాభాలున్నాయని ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ చెబుతున్నారు. 

46
డొపమిన్, సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ ఉత్పత్తి

మల్లెపూల వాసన వల్ల పెట్టుకున్న వ్యక్తికి, ఆ ఇంట్లో ఉండే కుటుంబానికి, చుట్టుపక్కల వాళ్లకు మె దడులో ఎమిగ్డెల్లా, హిప్పోక్యాంపస్‍ లాంటి కేంద్రాలు ఓవర్‍గా పనిచేస్తుంటే కామ్ చేస్తాయి. ముఖ్యంగా ఎక్కువ ఆలోచనల నుంచి బయటపడేలా చేస్తాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి పనిచేస్తుంది. మల్లెపూలలో ఉండే జాస్మోన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఇది డొపమిన్, సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ ఉత్పత్తి పెంచుతుంది. మెదడు నుంచి ఈ హ్యాపీ హార్మోన్లు రిలీజ్ అవ్వడంలో మెంటల్ పీస్ దొరుకుతుంది. 

56
అరోమాథెరపీలోనూ మల్లెపూలు

అంతేకాదు కొన్ని చోట్ల మల్లెపూల సువాసనను అరోమాథెరపీలోనూ ఉపయోగిస్తారు. రాత్రి వేళల్లో పెట్టుకుంటే హాయిగా నిద్రపడుతుందట. చాలా సందర్భాల్లో జాస్మిన్ స్మెల్ తలనొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ సువాసన వల్ల మెదడు రిలాక్స్ అవ్వడం వల్ల ఇలా అనిపిస్తుందని చెబుతున్నారు. 

66
జాస్మిన్ ఆయిల్ పీల్చినా కూడా మానసిక సాంత్వన

అందుకే మల్లెపూల వాసన పీల్చడం ఎంతో మంచిది. ఒకవేళ మల్లెపూలు మీకు దొరకపోతే మార్కెట్లో దొరికే జాస్మిన్ ఆయిల్ పీల్చినా కూడా మానసిక సాంత్వన, మెదడుకు రీఫ్రెష్‍నెస్ దొరుకుతుంది. ఇక మల్లెపూలు ఆడవాళ్లకు మరింత అందాన్ని పెంచుతుంది. మీకెవరికైనా మల్లెపూలంటే ఇష్టం లేకపోతే...ఇకపై ఇష్టం పెంచుకోండి. దానివల్ల ఈ లాభాలున్నప్పుడు అస్సలు మిస్ చేసుకోకండి.  

Read more Photos on
click me!

Recommended Stories