50 ఏళ్లు దాటిన తర్వాత మహిళల శరీరంలో సహజంగానే ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా మోనోపాజ్ కారణంగా హార్మోన్లలో అసమతుల్యత, ఎముకల బలహీనత, గుండె సంబంధిత సమస్యలు, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే సరైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను చాలా వరకు నియంత్రించవచ్చు. రోజువారీ డైట్‍లో కొన్ని ప్రత్యేకమైన ఫుడ్స్ ను చేర్చుకుంటే ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు.