2. రైస్ ఫేస్ ప్యాక్ (Rice Face Pack)
టానింగ్, పిగ్మెంటేషన్ , మొటిమల మచ్చలను తగ్గించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
కావలసినవి: 2 చెంచాల బియ్యం పిండి, 1 చెంచా పెరుగు, కొద్దిగా తేనె.
తయారీ: ఈ మూడింటిని కలిపి పేస్ట్‌లా చేయండి. ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు ఆరనివ్వండి.
వాడకం: తర్వాత కొద్దిగా నీటితో ముఖాన్ని తడిపి, మృదువుగా స్క్రబ్ చేస్తూ కడిగేయండి.
వారానికి ఎన్నిసార్లు?: ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి 2 నుండి 3 సార్లు మాత్రమే వాడాలి. రోజూ ఫేస్ ప్యాక్ వాడటం వల్ల చర్మం పొడిబారిపోయే (Dry skin) అవకాశం ఉంది. రెగ్యులర్ గా వీటిని వాడటం వల్ల మీ చర్మం మెరుస్తూ కనపడుతుంది.