Rice Water: బియ్యం నీటిలో వీటిని కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా!

Published : Mar 03, 2026, 06:14 PM IST

నల్లని, ఒత్తైన జుట్టు కోసం చాలామంది రకరకాల చిట్కాలు పాటిస్తుంటారు. కానీ బియ్యం నీటిలో కొన్ని సహజ పదార్థాలు కలిపి వాడటం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఆ పదార్థాలేంటో, అవి జుట్టుకు ఎలా మేలు చేస్తాయో ఇక్కడ చూద్దాం. 

PREV
15
Rice Water for Hair Growth

ప్రస్తుతం చాలామంది జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జుట్టు రాలడం, తెగడం, విరగడం, తెల్ల జుట్టు వంటి సమస్యలు చాలామందిలో కనిపిస్తున్నాయి. అయితే బియ్యం నీటిలో కొన్ని సహజ పదార్థాలు కలిపి ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. బియ్యం నీటిలో కార్బోహైడ్రేట్లు, ఇనోసిటాల్ వంటి పదార్థాలు ఉండటం వల్ల ఇవి జుట్టు వేర్లపై రక్షణ పొరలా ఏర్పడి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

25
ఏ పదార్థాలు కలుపుకోవచ్చంటే?

నిపుణుల ప్రకారం బియ్యం నీటిలో ఉల్లిపాయ రసం, అలొవెరా జెల్, మెంతుల పొడి, కరివేపాకు ముద్ద, కొబ్బరి నూనె వంటి పదార్థాలు కలిపి వాడవచ్చు. ఈ పదార్థాల్లో తల చర్మానికి మేలు చేసే లక్షణాలు ఉంటాయి. ఉల్లిపాయ రసంలో ఉండే సల్ఫర్ రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలొవెరా తల చర్మాన్ని శాంతపరిచే గుణం కలిగి ఉంటుంది. దానివల్ల దురద లేదా ఇర్రిటేషన్ తగ్గుతుంది. మెంతుల్లో ఉండే ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్ వంటి పదార్థాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. కరివేపాకులోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి.

35
తయారీ విధానం ముఖ్యం

నిపుణుల ప్రకారం బియ్యం నీటిని తయారు చేసే విధానం కూడా ముఖ్యమే. ఒక కప్పు బియ్యాన్ని కడిగి, రెండు మూడు కప్పుల నీటిలో 30–60 నిమిషాలు నానబెట్టాలి. ఆ నీటిని వడగట్టి అందులో ఒకటి లేదా రెండు చెంచాల అలొవెరా జెల్ లేదా తక్కువ మొత్తంలో మెంతుల నీరు కలపవచ్చు. ఉల్లిపాయ రసం కలిపాలి అనుకుంటే అప్పటికప్పుడు తయారు చేసి కలుపుకోవచ్చు. అయితే బియ్యం నీరు సున్నితమైన స్కాల్ప్ ఉన్నవారికి ఇర్రిటేషన్ కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.

45
వారానికి రెండుసార్లు..

వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే బియ్యం నీటిని వాడాలి. ప్రతిరోజూ వాడటం వల్ల జుట్టుపై ప్రోటీన్ లేయర్ ఎక్కువై గట్టిగా, పొడిగా మారే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా తీవ్రమైన డాండ్రఫ్ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. సహజ పదార్థాలు కూడా అందరికీ సరిపోవు. అలెర్జీ, మంట, ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే బియ్యం నీటి వాడకాన్ని ఆపేయాలి.

55
అవి కూడా ముఖ్యమే..

నిపుణుల ప్రకారం, జుట్టు ఒత్తుగా పెరగాలంటే పై నుంచే కాదు లోపలి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే ఫుడ్స్ తీసుకోవడం, ముఖ్యంగా ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్ డి, విటమిన్ బి12 వంటి పోషకాలు తగిన మోతాదులో తీసుకోవడం అవసరం. మంచి నిద్ర, ఒత్తిడి నియంత్రణ, మంచి ఫుడ్, సహజ చిట్కాలతో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories