టాలీవుడ్ స్టార్స్ రష్మిక మందన్న, విజయ్ దేవర కొండల వివాహం ఫిబ్రవరి 26వ తేదీన ఉదయ్ పూర్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. వీరిద్దరూ ఎన్నో సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ వీరిద్దరూ ఏ రోజు ఈ విషయంపై స్పందించలేదు. డైరెక్ట్ గా పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చారు. అయితే.. వీరి పెళ్లి చూసి అభిమానులు మాత్రం చాలా ఖుషీ అయ్యారు. పెళ్లి దుస్తుల్లో ఇద్దరూ చాలా అందంగా, చూడ ముచ్చటగా ఉన్నారంటూ అందరూ కామెంట్స్ చేశారు.
ఉదయ్ పూర్ లో వీరి వివాహం జరగగా, హైదరాబాద్ లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.దీనికి సంబంధించిన ఏర్పాట్లు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. విజయ్, రష్మికలు తమ పెళ్లికి ధరించిన దుస్తులు, జ్యూవెలరీకి సంబంధించి రోజుకో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.