Honey vs Lip Balm: చాలా మంది అమ్మాయిలు పెదవులకు రెగ్యులర్ గా లిప్ బామ్ ను పెడుతుంటారు. ఇది పెదవులను తేమగా ఉంచడంతో పాటుగా అందంగా కనిపించేలా చేస్తుంది. కానీ దీనికి బదులు మీరు పెదవులకు తేనె పెట్టినా సరిపోతుంది.
చలికాలం, వానాకాలంలో పెదవులు పగలడం చాలా కామన్. కానీ దీనివల్ల పెదవులు డ్రై అవుతాయి. ఒక్కోసారి పెదవుల పగుళ్ల నుంచి రక్తం కూడా వస్తుంది. అందుకే ఈ సమస్య రాకుండా ఉండేందుకు అమ్మాయిలు లిప్ బామ్ ను ఎక్కువగా వాడుతుంటారు. దీనివల్ల పెదవులు తేమగా ఉంటాయి. అలాగే అందంగానూ కనిపిస్తాయి. కానీ ఈ లిప్ బామ్ కు బదులుగా మీరు పెదవులకు తేనె పెట్టినా సరిపోతుంది. పెదవులకు తేనె పెట్టడం వల్ల ఎన్ని లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
24
పెదవులకు తేనె పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు
నేచురల్ మాయిశ్చరైజర్
తేనె నేచురల్ మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది. దీనిని పెదవులకు పెట్టడం వల్ల పెదవులు తేమగా ఉంటాయి. ఇది పెదవులు పొడిబారడాన్ని తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అలాగే పెదవులను మృదువుగా ఉంచుతుంది. రాత్రిపూట నిద్రపోయే ముందు తేనెను పెదవులకు రాయడం వల్ల ఉదయానికల్లా పెదవులు స్మూత్ గా అవుతాయి.
వైద్య లక్షణాలు
తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పెదవులపై ఉన్న చిన్న చిన్న గాయాలను, పగుళ్లను తగ్గించడంలో సహాయపడతాయి. తేనె వానాకాలం, చలికాలంలో పెదవులకు మంచి రక్షణగా ఉంటుంది. అలాగే పెదవులకు తేనెను రాయడం వల్ల పెదవులు వాపు, ఎరుపు కూడా తగ్గుతాయి.
34
యాంటీఆక్సిడెంట్లు
తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పెదవులపై ఉన్న చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే ఎండ, కాలుష్యం నుంచి పెదవులను రక్షించడానికి కూడా ఇది సహాయపడుతుంది.
ఎక్స్‌ఫోలియేషన్
తేనెలో కొంచెం నిమ్మరసం కలిపి పెడితే చనిపోయిన చర్మ కణాలు తొలగిపోతాయి. ఇవి పెదవులను నేచురల్ గా ఎక్స్ఫోలియేట్ చేస్తాయి. ఇది ఎలాంటి కఠినమైన స్క్రబ్ లు అవసరం లేకుండా చనిపోయిన చర్మకణాలను తొలగించేందుకు సహాయపడుతుంది. దీంతో పెదవులు తాజాగా, అందంగా కనిపిస్తాయి. అంతేకాదు దీంతో మీ పెదవులు పింక్ కలర్ లో కనిపిస్తాయి.
చాలా మంది లిప్ బామ్ ను పెట్టుకోవడానికి ఒక రీజన్ ఉంది. ఇది ఒక్కసారి పెట్టుకుంటే ఐదారు గంటలు ఉంటుంది. అలాగే పెదవులకు ఎక్కువ సేపు తేమగా ఉంచుతుంది. దీన్ని పదే పదే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇది దుమ్ము ధూళి నుంచి పెదవులను కాపాడుతుంది.
ఇది ఒక రక్షిత పొరను ఏర్పరిచి పెదవులకు ఎలాంటి హాని జరగదు. ఇకపోతే తేనెను పెదవులకు పెట్టుకుంటే ఇది ఎక్కువ సేపు ఉండదు. అలాగే జిగటగా కూడా ఉంటుంది. దీన్ని మళ్లీ మళ్లీ పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే దీనికి అంటుకునే స్వభావం ఉంటుంది కాబట్టి పెదవులకు దుమ్ము, ధూళి అంటుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దీనికంటే లిప్ బామ్ ను పెట్టుకోవడమే బెటర్.