Dark Circles: కంటి కింద డార్క్ సర్కిల్స్ వచ్చాయా? ఇవి రోజూ రాస్తే చాలు..!

Published : Sep 19, 2025, 10:12 AM IST

Dark Circles: డార్క్ సర్కిల్స్ తగ్గించుకోవడానికి చాలా మంది మార్కెట్లో దొరికే ఏవేవో క్రీములు తెచ్చి.. పూసేస్తూ ఉంటారు. అయినా పూర్తిగా అవి తగ్గే అవకాశం లేదు. ఇక.. మార్కెట్లో వీటికి ఉన్న చికిత్స కూడా చాలా ఖరీదుతో కూడుకున్నది.

PREV
15
Dark Circles

ఈరోజుల్లో చాలా మంది డార్క్ సర్కిల్స్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ డార్క్ సర్కిల్స్ కారణంగా... ముఖంలో అందం తగ్గిపోతుంది. వయసు పైబడినవారిలా కనిపిస్తారు. అందుకే.. వీటిని తగ్గించుకోవడానికి చాలా మంది మార్కెట్లో దొరికే ఏవేవో క్రీములు తెచ్చి.. పూసేస్తూ ఉంటారు. అయినా పూర్తిగా అవి తగ్గే అవకాశం లేదు. ఇక.. మార్కెట్లో వీటికి ఉన్న చికిత్స కూడా చాలా ఖరీదుతో కూడుకున్నది. అయితే.. రూపాయి ఖర్చు లేకుండా... మీ ఇంట్లో దొరికే కొన్నింటిని వాడి కూడా ఈ డార్క్ సర్కిల్స్ కి చెక్ పెట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

25
డార్క్ సర్కిల్స్ తగ్గించే బంగాళదుంప రసం....

బంగాళదుంపరం కళ్లు, చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ ఉంటే... ఒక తాజా బంగాళదుంపను తురిమి.. ఆ రసాన్ని తీసి.. మీ కంటి చుట్టూ రాయాలి. ఇలా రాసిన 15 నిమిషాల తర్వాత మీ ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి. క్రమం తప్పకుండా వారం రోజులు ఇలా చేసినా.. మీకు మంచి ఫలితాలు వస్తాయి. నెమ్మదిగా.. డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి.

35
డార్క్ సర్కిల్స్ కి చెక్ పెట్టే పాలు...

మీ కంటి కింది డార్క్ సర్కిల్స్ రోజు రోజుకీ పెరుగుతున్నాయి అని మీకు అనిపిస్తే... మీరు మీ చర్మంపై పచ్చి పాలు వాడితే చాలు.

పాలలోని లాక్టిక్ ఆమ్లం చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది. పచ్చి పాలలో కాటన్ బాల్ ముంచి మీ కళ్ళపై ఉంచండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత, కొంత సమయం తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని కడగాలి.

45
టీ బ్యాగ్...

రోజూ టీ తాగితే.. ఒత్తిడి ఎలా తగ్గుతుందో... టీ బ్యాగ్ లు వాడి డార్క్ సర్కిల్స్ కి చెక్ పెట్టొచ్చు . ముఖం కాంతివంతంగా మారడానికి కూడా చల్లని టీ బ్యాగ్‌లు ప్రయోజనకరంగా ఉంటాయి. టీ బ్యాగ్‌ను రెండు నిమిషాలు నీటిలో నానబెట్టి, ఆపై రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. మీకు సమయం దొరికినప్పుడు, దానిని రిఫ్రిజిరేటర్ నుండి తీసివేసి, మీ కళ్ళపై ఉంచి, 15 నిమిషాలు పడుకోండి. రెగ్యులర్ గా ఇలా చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ పూర్తిగా తగ్గిపోతాయి.

55
కొబ్బరి నూనె...

కొబ్బరి నూనె చర్మ సౌంద్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా మీ కంటి కింద డార్క్ సర్కిల్స్ వస్తే... వాటికి చెక్ పెట్టడానికి కొబ్బరి నూనె వాడితే చాలు. ఒత్తిడి లేదా తగినంత నిద్ర లేకపోవడం వల్ల నల్లటి వలయాలు కనిపిస్తే, పడుకునే ముందు, మీ చేతిలో 2-3 చుక్కల కొబ్బరి నూనె తీసుకొని మీ వేళ్లతో మీ కళ్ళ చుట్టూ మసాజ్ చేయండి. దీన్ని అప్లై చేసి రాత్రంతా నిద్రపోండి. రెగ్యులర్ గా ముఖానికి కొబ్బరి నూనె ఇలా రాస్తే.. డార్క్ సర్కిల్స్ పూర్తిగా తగ్గిపోవడం ఖాయం.

Read more Photos on
click me!

Recommended Stories