
ఆడవాళ్లు అందంగా కనిపించేందుకు ఎన్నో చిట్కాలను పాటిస్తుంటారు. కానీ చాలా మంది ఆడవారికి నోటి చుట్టూరా నల్లగా ఉంటుంది. ఇదే వారిని అందంగా కనిపించకుండా చేస్తుంది. ఈ నలుపును దాచడానికి చాలా మంది ఆడవారు ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. అయినా ఇది మాత్రం పోదు. అయితే ప్రతి ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో ఈ నలుపును సులువుగా పోగొట్టొచ్చు. వీటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
నోటి చుట్టూ నలుపు ఎందుకు ఏర్పడుతుంది?
నోటి చుట్టూ నలుపు ఏర్పడటానికి కారణం హైపర్ పిగ్మెంటేషన్ . దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎండలో ఎక్కువ సేపు ఉండటం, చర్మ సంరక్షణ సరిగ్గా లేకపోవడం, హార్మోన్ల అసమతుల్యత వంటి వివిధ కారణాల వల్ల నోటి చుట్టూ నల్లగా అవుతుంది. మరి ఈ నలుపు పోవడానికి ఇంట్లో ఉన్న ఏ పదార్థాలను వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పెరుగు కూడా నోటి చుట్టూ ఉన్న నలుపును పోగొట్టడానికి బాగా సహాయపడుతుంది. అయితే నోటి చుట్టూ ఉన్న చర్మం డీహైడ్రేట్ కావడం వల్లే చర్మం నల్లగా అవుతుంది.అయితే పెరుగు చర్మాన్ని హైడ్రేట్ గా చేసి నలుపును పోగొట్టడానికి సహాయపడుతుంది. ఇందుకోసం నోటిచుట్టూ పెరుగును అప్లై చేసి కాసేపు మసాజ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్ల నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచుగా చేస్తే సమస్య తగ్గుతుంది.
బొప్పాయి, తేనె
బొప్పాయి, తేనె కూడా నోటి చుట్టూ ఉన్న నలుపును పోగొట్టడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం పండిన బొప్పాయి పండు గుజ్జులో కొంచెం తేనె కలిపి రాయండి. ఈ తేనె, బొప్పాయి స్కిన్ టోన్ ను మెరుగుపరిచి కాంతివంతంగా చేయడానికి సహాయపడతాయి. దీన్ని మీరు మెడ నలుపును పోగొట్టడానికి కూడా ఉపయోగించొచ్చు.
నోటి చుట్టూ ఉన్న నలుపును పోగొట్టడానికి నిమ్మరసం చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో ఉండే సిట్రిక్ యాసిడ్ నోటి చుట్టూ ఉన్న నలుపును తొలగిస్తుంది. ఇందుకోసం సగం నిమ్మకాయ తీసుకుని నోటి చుట్టూ ఐదు నిమిషాలు రుద్దండి. కావాలనుకుంటే మీరు దీనికి షుగర్ ను కూడా కలిపి రుద్దొచ్చు.
టమాటా రసం
టమాటా రసం కూడా నోటి చుట్టూ ఉన్న నలుపును పోగొట్టడానికి సహాయపడుతుంది. ఇందుకోసం ఒక గిన్నె తీసుకుని అందులో టీ స్పూన్ టమాటా రసాన్ని వేయండి. దీనిలోనే 1/2 స్పూన్ నిమ్మరసం, కొంచెం పసుపును వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని నోటి చుట్టూ ఉన్న నలుపుపై అప్లై చేయండి. ఒక 20 నిమిషాల తర్వాత చల్ల నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది. ఇలా మీరు గనుక వారానికి రెండు మూడు సార్లు చేస్తే నలుపు మటుమాయం అవుతుంది.
తేనె, నిమ్మరసం
తేనె, నిమ్మరసం కూడా నోటి చుట్టూ ఉన్న నలుపును పోగొట్టడానికి సహాయపడుతుంది. ఇందుకోసం ఒక గిన్నె తీసుకుని అందులో టీ స్సూన్ తేనె, టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసి బాగా కలపండి. దీన్ని రాత్రిపూట పడుకునే ముందు నోటి చుట్టూ ఉన్న నలుపుపై రాయండి. దీన్ని ఉదయాన్నే చల్ల నీళ్లతో కడిగేయండి. ఇలా రోజూ చేస్తే నోటి చుట్టూ ఉన్న నలుపు మాయమవుతుంది.
ఆలుగడ్డ రసాన్ని ఎన్నో చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి ఉఫయోగిస్తారు. దీన్ని ఉపయోగించి డార్క్ సర్కిల్స్, ముఖం మీదున్న నల్ల మచ్చలను సులువుగా పోగొట్టొచ్చు. అంతేకాదు ఇది నోటి చుట్టూ ఉన్న నలుపును పోగొట్టడంలో కూడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం బంగాళాదుంప రసాన్ని తీసుకుని కాటన్ తో నోటి చుట్టూ ఉన్న నలుపుపై రాయండి. దీన్ని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే చల్ల నీళ్లతో కడిగేయండి. రోజూ ఇలా చేసినా నలుపు పోతుంది.
పసుపు
పసుపు ఎన్నో చర్మ సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించి మొటిమలను, మచ్చలను, ఇతర చర్మ సమస్యలను సులువుగా తగ్గించుకోవచ్చు. అలాగే పసుపు కూడా నోటి చుట్టూ ఉన్న నలుపును పోగొట్టడానికి కూడా సహాయపడుతుంది. ఇందుకోసం కొంచెం పసుపును తీసుకుని అందులో రోజ్ వాటర్ ను కలిపి పేస్ట్ చేయండి. దీన్ని నోటిచుట్టూ రాసి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి. ఇళా రోజూ చేస్తే నోటి చుట్టూ ఉన్న నలుపు పోయి ముఖం కాంతివంతంగా అవుతుంది.
బీట్ రూట్ రసం మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ రసాన్ని ఉపయోగించి నోటి చుట్టూ ఉన్న నలుపును సులువుగా పోగొట్టొచ్చు. ఇందుకోసం బీట్ రూట్ రసాన్ని దూది సహాయంతో నోటి చుట్టూ ఉన్న నలుపుపై రుద్దండి. దీన్ని రాత్రి అలాగే ఉంచి ఉదయాన్నే చల్ల నీళ్లతో కడిగేయండి. ఇలా వారానికి రెండుమూడు సార్లు చేస్తే నలుపు లేకుండా పోతుంది.