Hair Oil: జుట్టు పెరుగుదలను చాలా అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. దుమ్మూ, ధూళి, ఆహారం మాత్రమే కాదు, అధిక ఒత్తిడి కూడా జుట్టు పెరుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. అందుకే.. మనం హాట్ ఆయిల్ తో జుట్టు కుదుళ్లను, జుట్టు మొత్తాన్ని మంచిగా మసాజ్ చేయాలి.
జుట్టు అందంగా, ఒత్తుగా మార్చుకోవాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. కానీ.. ఈరోజుల్లో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఎంత ఖరీదైన షాంపూలు, సీరమ్స్ వాడినా కూడా జుట్టు రాలడం తగ్గడం లేదని..దానికి తోడు చండ్రు సమస్య కూడా వేధిస్తోందని చాలా మంది ఫీలౌతూ ఉంటారు. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే... కేవలం కొబ్బరి నూనెతో చెక్ పెట్టొచ్చు. నార్మల్ గా జుట్టుకు నూనె రాయడం కాకుండా.... నూనెను వేడి చేసి.. జుట్టుకు మంచిగా మసాజ్ చేయడం వల్ల ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి.
24
హాట్ ఆయిల్ మసాజ్....
జుట్టు పెరుగుదలను చాలా అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. దుమ్మూ, ధూళి, ఆహారం మాత్రమే కాదు, అధిక ఒత్తిడి కూడా జుట్టు పెరుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. అందుకే.. మనం హాట్ ఆయిల్ తో జుట్టు కుదుళ్లను, జుట్టు మొత్తాన్ని మంచిగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఉపశమనం లభిస్తుంది. తలలో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. దీని వల్ల జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. హాట్ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల మంచి నిద్ర కూడా పడుతుంది. దీని కోసం... మీరు కొబ్బరి నూనె లేదంటే.. ఆముదం వాడితే సరిపోతుంది.
34
జుట్టు రాలడం తగ్గాలంటే....
మీకు జుట్టు ఎక్కువగా రాలుతోంది అనిపిస్తే... వెంటనే హాట్ ఆయిల్ తో మసాజ్ చేయాలి. అది కూడా విటమిన్ ఇ నూనెను వాడటం మంచిది. బాదం నూనె అయినా వాడొచ్చు. ఇవి వాడటం వల్ల... జుట్టు రాలడం తొందరగా తగ్గుతుంది. జుట్టు కుదుళ్లు బలపడతాయి. మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది.
మీ జుట్టు చాలా పొడిగా ఉంటే, మీరు దానిని కొబ్బరి నూనెతో కండిషన్ చేయాలి. ఇది జుట్టు కుదుళ్లలోకి సులభంగా చొచ్చుకుపోతుంది. మూలాల నుండి తేమను అందిస్తుంది. మీరు ఇలా ప్రతిరోజూ చేస్తే, మీ జుట్టుపై రసాయన ఆధారిత కండిషనర్‌లను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. దీని కోసం తలస్నానం చేయడానికి రెండు గంటల ముందు.. జుట్టు కుదుళ్లకు కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి.. జుట్టుకు మసాజ్ చేయాలి. దీని వల్ల జుట్టు మృదువుగా మారుతుంది.
చండ్రు తగ్గాలంటే...
మీరు చాలా కాలంగా చుండ్రు సమస్యతో బాధపడుతున్నట్లయితే... తలకు టీట్రీ ఆయిల్ తో మసాజ్ చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల చుండ్రు సమస్య పూర్తిగా తగ్గుతుంది. ఇక.. మీకు రెగ్యులర్ గా హెయిర్ స్ట్రెయిట్నర్ లు లాంటి హీట్ ప్రొడక్ట్స్ లాంటివి వాడే అలవాటు ఉంటే... వాటి వల్ల కూడా జుట్టు డ్యామేజ్ అవుతుంది. అలా అవ్వగుండా ఉండాలంటే కూడా మీ జుట్టుకు గోరు వెచ్చని కొబ్బరి నూనెతో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు డ్యామేజ్ అవ్వగుండా ఉంటుంది.