కుక్కర్ ను ఇంకా వాడుతున్నారా? ఇన్ని రోజులకంటే ఎక్కువ ఉపయోగించొద్దు

Published : Sep 02, 2025, 10:16 AM IST

కుక్కర్లను సంవత్సరాలకు సంవత్సరాలు ఉపయోగిస్తూనే ఉంటారు. కుక్కర్ బాగుంది కదా? వాడితే ఎలాంటి సమస్య లేదని అనుకుంటారు. కానీ కుక్కర్ కు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది తెలుసా?

PREV
16
పాత ప్రెషర్ కుక్కర్

కుక్కర్ల వాడకం వల్ల ఆడవాళ్లకు వంటపని సులువు అయ్యిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. కుక్కర్ ను ఉపయోగించి గంటల్లో అయ్యే వంట కేవలం నిమిషాల్లో అవుతోంది. అందుకే ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లో ప్రెషర్ కుక్కర్ ఖచ్చితంగా ఉంది. అయితే కుక్కర్లు చాలా రోజుల వరకు ఎలాంటి రిపేర్ కాకుండా ఉంటాయి. అందుకే వీటిని చాలా ఏండ్లు వాడుతుంటారు. కానీ ఒకే కుక్కర్ ను ఎక్కువ కాలం ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

26
ప్రెషర్ కుక్కర్

ఏండ్ల నాటి కుక్కర్ లను వాడితే దాని నుంచి అల్యూమినియం, సీసం వంటి వెలువడతాయి. ఇవి కుక్కర్ లోని ఆహారంతో కలిసిపోతాయి. ముఖ్యంగా సీసం మన శరీరంలోకి వెళితి అంత సులువుగా బయటకు వెళల్దు. ఇది మన రక్తం, మెదడు వంటి అవయవాల్లోకి చేరుతుంది. దీనివల్ల మానసిక స్థితిలో మార్పులొస్తాయి. అలాగే నరాల బలహీనత సమస్య వస్తుంది. జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

36
ప్రెషర్ కుక్కర్

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పాత ప్రెషర్ కుక్కర్ వాడకం వల్ల పిల్లల ఆరోగ్యంపై పెద్ద ప్రభావం ప డుతుంది. కుక్కర్ నుంచి వెలువడే సీసం పిల్లలకు ప్రమాదకరంగా మారుతుంది. ఇది పిల్లల మెదడు అభివృద్ధిని ఆగిపోయేలా చేస్తుంది.లేదా నెమ్మదింపజేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు పిల్లలు ఏ విషయాన్నైనా నేర్చుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. అలాగే అవగాహన లోపం కూడా ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఒకే కుక్కర్ ను ఎక్కువ రోజులు వాడకూడదు. 

46
పాత ప్రెషర్ కుక్కర్

పాత ప్రెషర్ కుక్కర్ లో వండిన ఆహారాలను తింటే మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. బాగా అలసటగా ఉంటుంది. అలాగే మూత్రపిండాల సమస్యలు, రక్తపోటు సమస్యలు వస్తాయి. అలాగే జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 

56
ప్రెషర్ కుక్కర్

మీరు ఉపయోగించే కుక్కర్ లో నల్ల మచ్చలు, గీతలు ఉంటే గనుక అస్సలు వాడకండి. అలాగే విజిల్ లేదా మూత లూజ్ గా ఉంటే కూడా ఆ కుక్కర్ ను వాడకూడదు. అలాగే కుక్కర్ లో వండిన ఆహారంలో ఏదైనా లోహాల వాసన వస్తే కూడా ఆ కుక్కర్  ప్లేస్ లో కొత్త కుక్కర్ ను వాడాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. 

66
కుక్కర్ ను ఎన్ని ఏండ్లు వాడాలి?

మీరు వాడే కుక్కర్ ఎంత బాగా పనిచేసినా కూడా మీరు దాన్ని 10 ఏండ్లు దాటిందంటే ఇక పక్కన పెట్టాల్సిందే. దీన్ని 10 సంవత్సారాలకు మించి వాడితే మీరు అనారోగ్య సమస్యల బారిన పడతారు. మనం ఉపయోగించి మసాలా దినుసుల నుంచి మందుల వరకు ఎలా అయితే ఎక్స్పైరీ డేట్ ఉంటుందో కుక్కర్ కు కూడా గడువు ఉంటుంది. కాబట్టి పాత కుక్కర్లు ఉంటే వాటిని తీసేసి కొత్తవాటిని ఉపయోగించండి. 

Read more Photos on
click me!

Recommended Stories