ఇది రాస్తే మీ ముఖం వెంటనే మెరిసిపోతుంది

Published : Aug 31, 2025, 12:55 PM IST

సడెన్ గా వెళ్లాల్సిన పార్టీలు, పెళ్లిళ్లు చాలానే వస్తుంటాయి. ఇలాంటప్పుడు ముఖానికి వెంటనే గ్లో అవసరం. అయితే పచ్చి పాలను ఉపయోగించి మీ ముఖాన్ని వెంటనే కాంతివంతంగా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

PREV
14
పచ్చిపాల ఫేస్ ప్యాక్

ప్రతి అమ్మాయి తన ముఖం అందంగా, మంచి గ్లో ఉండాలని కోరుకుంటుంది. ఇందుకోసం ఆడవారు ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఎంత ఖరీదైన మేకప్ ను వేసుకున్నా ముఖంలో అస్సలు గ్లో ఉండదు. ఇలాంటి సమయంలో ఒక చిన్న చిట్కా పనికొస్తుంది. దీనికోసం మీరు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.

24
పచ్చిపాల ఫేస్ ప్యాక్

మీరు సడెన్ పార్టీకి లేదా ప్రత్యేక సందర్భానికి లేదా పెళ్లికి వెళ్లాల్సి వచ్చినప్పుడు వెంటనే తయారవ్వాల్సి ఉంటుంది. అయితే చాలా మంది రకరకాల మేకప్ లను వేసుకుంటుంటారు. చాలా సార్లు ఈ మేకప్ లు కూడా పనికిరావు. మేకప్ వేసుకున్నా ముఖం నీరసంగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు మీకు పచ్చిపాలు మంచి ప్రయోజనకరంగా ుంటాయి. అవును పచ్చి పాలతో మీ చర్మాన్ని అందంగా, మెరిసేలా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

34
పచ్చిపాల క్లెన్సర్, స్క్రబ్

పచ్చిపాలను ఉపయోగించి మీ ముఖాన్ని వెంటనే కాంతివంతంగా చేయాలనుకుంటే ఒక కొన్నెలో కొన్ని పచ్చిపాలను పోసి అందులో కొంచెం కాఫీ పొడి, కొంచెం తేనె వేసి బాగా కలపండి. ఈ పేస్ట్ ను ముఖానికి, మెడకు బాగా రాయండి. దీన్ని కొంచెం సేపు నెమ్మదిగా మసాజ్ చేయండి. ఈ ఫేస్ ప్యాక్ ముఖానికి మంచి క్లెన్సర్ గా, స్క్రబ్ గా పనిచేస్తుంది.

44
పచ్చిపాల ఫేస్ ప్యాక్

పచ్చిపాల ఫేస్ ప్యాక్ ముఖానికి మంచి గ్లో ను ఇస్తుంది. ఇందుకోసం బియ్యం పిండిలో కొంచెం రోజ్ వాటర్ ను వేసి మెత్తని పేస్ట్ లా చేయండి. దీనిలో మీరు కొంచెం గ్లిజరిన్ ను కూడా కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి నెమ్మదిగా చేతులతో మసాజ్ చేయండి. ఈ ఫేస్ ప్యాక్ పూర్తిగా ఆరిన తర్వాతే కడగాలి. ఇది ఇన్ స్టంట్ గ్లోను ఇస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ తో మీ ముఖం వెంటనే మెరుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories