వంటింట్లో పండ్లు, కూరగాయల వ్యర్థాలతో పాటుగా మిగిలిన ఆహార వ్యర్థాలు ఉంటాయి. ఇది కామనే. కాకపోతే వీటిని ఎప్పటికప్పుడు బయటవేయాలి. ఎందుకంటే చెత్త వల్ల ఇంట్లోకి పురుగులు, కీటకాలు, చీమలు వస్తాయి. వీటివల్ల అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. వంటింట్లో తేమ ఉండకుండా చూసుకోవాలి.