Cucumber: కీరదోసకాయలో నీరు పుష్కలంగా ఉండటం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు తగ్గుతాయి. అలాగే విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, చర్మ సౌందర్యానికి కూడా దోసకాయ ఎంతో ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు.
కీర దోసకాయ అనేది మనందరికీ సుపరిచితమైన కూరగాయ. ముఖ్యంగా వేసవికాలంలో దోసకాయ తినడం వల్ల శరీరానికి చల్లదనం కలిగిస్తుంది. ఇందులో నీరు పుష్కలంగా ఉండటం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు తగ్గుతాయి. అలాగే విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, చర్మ సౌందర్యానికి కూడా దోసకాయ ఎంతో ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు. అందుకే చాలామంది పార్లర్లలో దోసకాయతో చేసిన ఫేస్ ప్యాక్‌లను ఉపయోగిస్తారు. మరి, రోజూ కీరదోసకాయ తింటే మనకు కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
25
చర్మాన్ని తేమగా మార్చి, సహజ కాంతి..
కీర దోసకాయలో సుమారు 90 శాతం నీరు ఉంటుంది. ఈ నీరు చర్మంలో తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. పొడి చర్మం కలిగిన వారు ఫేస్ కి కీర దోసకాయ మాస్క్ కూడా వాడొచ్చు. ఇది ముఖంపై చల్లదనాన్ని కలిగించి, సహజమైన కాంతిని తీసుకొస్తుంది. యవ్వనంగా కనిపించే అవకాశం ఉంది.
35
2. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ తగ్గించే
కళ్ల కింద ఉండే నల్లటి వలయాలు చాలా మందిని ఇబ్బంది పెడతాయి. దోసకాయ ముక్కలను కళ్లపై ఉంచితే కంటి కింద వాపు తగ్గిపోతుంది. అలాగే నల్లటి వలయాలు కూడా తగ్గుతాయి. దీనిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మంచి ఫలితాలు కనపడతాయి.
3. యాంటీఆక్సిడెంట్లు
కీరదోసకాయలో విటమిన్ C, విటమిన్ B వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. వయసు పెరిగేకొద్దీ వచ్చే ముడతలను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. అంతేకాకుండా దోసకాయ తొక్క , విత్తనాల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మంపై ఉండే బ్యాక్టీరియాను తొలగించి మచ్చలు తగ్గిస్తాయి.
సూర్యకిరణాలు లేదా వయసు పెరగడం వల్ల ముఖంపై మచ్చలు రావడం సాధారణం. కీరదోసకాయలో ఉన్న పోషకాలు ఆ మచ్చలను తగ్గించి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి. దోసకాయ రసం తీసుకుని ముఖంపై రాసినా లేదా రోజూ దీనిని తిన్నా...చర్మం సహజంగా కాంతివంతంగా మారుతుంది.
5. జిడ్డును తగ్గిస్తుంది
చర్మం ఆయిల్‌గా ఉండే వారికి దోసకాయ ఒక మంచి సహజ పరిష్కారం. దోసకాయలోని విటమిన్లు, ఖనిజాలు చర్మంలో ఉండే అధిక జిడ్డును తగ్గించి, ముఖాన్ని ఫ్రెష్‌గా ఉంచుతాయి. అందుకే వేసవికాలంలో దోసకాయ ఫేస్ ప్యాక్‌లు విస్తృతంగా వాడతారు.
55
6. వాపు, ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది
కీరదోసకాయలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మం మీద ఉండే ఎర్రటి వాపు, ఇర్రిటేషన్ వంటి సమస్యలను తగ్గిస్తాయి. సున్నితమైన చర్మం కలిగిన వారు కూడా కీర దోసకాయ ప్యాక్‌ని ఉపయోగించవచ్చు.
7. సహజమైన కాంతి
రోజూ కీర దోసకాయ తినడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఫైబర్ లభిస్తాయి. ఇది శరీరాన్ని లోపల నుంచి శుభ్రం చేస్తుంది. దాంతో సహజంగానే చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.
ఫైనల్ గా …
మొత్తం మీద, కీర దోసకాయ అనేది చర్మానికి అద్భుతమైన సహజ ఔషధం లాంటిది. నీటిశాతం ఎక్కువగా ఉండటం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మం తాజాగా, ప్రకాశవంతంగా మారుతుంది. క్రమం తప్పకుండా కీర దోసకాయను ఆహారంగా తీసుకోవడం, ఫేస్ మాస్క్‌లలో ఉపయోగించడం ద్వారా ఆరోగ్యకరమైన, కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.