Face Glow: చలికాలంలో ఈ జ్యూస్ లు తాగితే చాలు, ముఖం చందమామలా మెరుస్తుంది

Published : Nov 28, 2025, 03:19 PM IST

Face Glow: అందాన్ని లోపలి నుంచి పెంచుకోవడానికి ప్రయత్నించాలి. దాని కోసం మీరు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తమ ఆహారంలో చేర్చుకుంటే చాలు. ఆరోగ్యం మాత్రమే కాదు, అందం కూడా మెరుగుపడుతుంది. 

PREV
15
Face Glow

అందంగా ఉన్న అమ్మాయిలను చంద్రుడితో పోల్చడం మీరు చూసే ఉంటారు. చాలా మంది అమ్మాయిలకు కూడా అలానే చంద్రుడిలా మెరుస్తూ కనపడాలని అనుకుంటూ ఉంటారు. దాని కోసం ఖరీదైన క్రీములు వాడుతూ ఉంటారు. కానీ.. ఎంత ఖరీదైన క్రీములు వాడినా కూడా కోరుకున్నట్లుగా కనిపించకపోవచ్చు. కానీ... ఇంట్లో ఈజీగా చేసుకోగల కొన్ని జ్యూస్ లు తాగితే మాత్రం... మీరు కోరుకున్నట్లు మీ స్కిన్ మారిపోతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

25
కీరదోసకాయ జ్యూస్..

చలికాలంలో కీరదోస కాయ జ్యూస్ తాగితే.. మీ చర్మం అందంగా మారుతుంది. దీని వల్ల మీ స్కిన్ హైడ్రేటెడ్ గా మారుతుంది. ముఖం ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా మారుతుంది. దీనిని ఏదో ఒక రూపంలో మీ డైట్ లో భాగం చేసుకోవచ్చు. మీరు ప్రతిరోజూ లేదా వారానికి కనీసం 2 సార్లు దోసకాయతో తయారుచేసిన రసాన్ని త్రాగవచ్చు. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు , ఇతర పోషకాలు చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి. ఇది చర్మం పొడిబారకుండా నిరోధిస్తుంది . కంటి చుట్టూ బ్లాక్ సర్కిల్స్ కూడా తొలగిస్తుంది.

35
టమోటా రసం:

ముఖాన్ని ప్రకాశవంతంగా ఉంచుకోవాలనుకునే వారు టమోటా రసాన్ని తాగవచ్చు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి లైకోపీన్ బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి. చర్మాన్ని అందంగా మార్చడంతో పాటు, ముఖంపై మొటిమల సమస్య కూడా ఉండదు.

45
క్యారెట్ రసం:

మీ చర్మం మెరుస్తూ, ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరుకుంటే, క్యారెట్ రసం మీకు మంచి ఎంపిక. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మీ ముఖం నుండి నల్లటి మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది.ఎల్లప్పుడూ మెరుస్తూ ఉంటుంది.

55
పాలకూర రసం:

శీతాకాలంలో సంభవించే వాతావరణ మార్పులు శరీర రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. శారీరక సమస్యలతో పాటు, చర్మంపై మొటిమలు పెరగడం, ముఖంపై తెల్లటి మచ్చలు వంటి ఇతర ప్రభావాలు కూడా ఉండవచ్చు. ఈ సమస్యను తగ్గించుకోవడానికి మీరు పాలకూర జ్యూస్ తాగొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories