పీరియడ్స్ సమయంలో స్త్రీలకు భరించలేని నొప్పి వస్తూ ఉంటుంది. ఇది చాలా సహజం. అయితే, ఆ నొప్పిని భరించలేక చాలా మంది మందులు వాడుతూ ఉంటారు. కానీ, అవి ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదు. వాటికి బదులు కొన్ని రకాల హెర్బల్ డ్రింక్స్ తాగడం వల్ల ఆ నొప్పి నుంచి బయటపడొచ్చు.
26
చమోమిలే టీ
చమోమిలే టీ మీ కడుపు కండరాలను సడలిస్తుంది. ఇది నొప్పిని తగ్గిస్తుంది. చమోమిలే టీ తాగడం వల్ల కడుపు నొప్పి తగ్గడమే కాకుండా మంచి నిద్ర, ఆందోళన నుండి ఉపశమనం కలుగుతుంది.
36
అల్లం టీ
అల్లం టీ కూడా కడుపు నొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లం టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి..పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
ఋతుక్రమ సమయంలో దాల్చిన చెక్క టీ తాగడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ టీ తాగడం వల్ల కూడా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
56
బెల్లం టీ..
బెల్లం టీ ఋతుక్రమ సమయంలో కండరాల నొప్పులను తగ్గిస్తుంది. సాధారణంగా టీలో అందరూ పంచదార వేసుకుంటారు. ఆ పంచదార కి బదులు బెల్లం వేయడం వేసి టీ కాచడం వల్ల.. పీరియడ్స్ పెయిన్ నుంచి ఉపశమనం కలుగుతుంది.
66
తేలికపాటి వ్యాయామాలు
దీనితో పాటు హీటింగ్ ప్యాడ్‌లు, తేలికపాటి వ్యాయామాలు కూడా మీకు కడుపు నొప్పి నుండి చాలా ఉపశమనం కలిగిస్తాయి.