పాల ఐస్ క్యూబ్స్ తో మనకు కలిగే ప్రయోజనాలు...
చర్మానికి సహజ గ్లో అందిస్తుంది
పాలులోని లాక్టిక్ యాసిడ్ చర్మంపై మృతకణాలను తొలగిస్తుంది. ఇది సహజమైన మెరుపు, నిగారింపును తీసుకువస్తుంది.
మొటిమలు తగ్గించడంలో సహాయపడుతుంది
పాల ఐస్ క్యూబ్స్ చర్మాన్ని శుభ్రపరుస్తాయి. ముఖంపై పేరుకుపోయిన మురికిని బయటకు తీస్తాయి. దీంతో మొటిమల సంఖ్య తగ్గుతుంది.
బ్లాక్ సర్కిల్స్ తగ్గిస్తాయి..
కళ్ల చుట్టూ చాలా మందికి బ్లాక్ సర్కిల్స్ వచ్చి అందవిహీనంగా కనపడతాయి.అంతేకాదు సరిగా నిద్రలేకపోతే కళ్లు ఉబ్బుతాయి. ఇలాంటి సమస్యలకు ఈ పాల ఐస్ క్యూబ్స్ చెక్ పెడతాయి.పాలలోని పోషకాలు చర్మానికి పోషణను అందిస్తూ, నల్లటి వలయాలను తగ్గిస్తాయి.
చర్మం బిగుతుగా మారుతుంది
ఐస్ వల్ల చర్మం గట్టిపడుతుంది. పొడిగా ఉండే వారికీ తేమను అందిస్తుంది.చర్మం మృదువుగా మారడానికి సహాయపడుతుంది.