జుట్టు నల్లగా, ఒత్తుగా ఉండాలని కోరుకోని వారు ఎవరు ఉంటారు చెప్పండి. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి రకరకాల ప్రోడక్టులు వాడుతుంటారు. వేల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. కానీ ఇంట్లో దొరికే కొన్ని సహజ పదార్థాలతో జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయవచ్చని మీకు తెలుసా?
జుట్టు అందానికి ప్రతీక. నల్లని ఒత్తైన జుట్టు కోసం అమ్మాయిలు చేయని ప్రయత్నాలు ఉండవు. వాడని ప్రోడక్టులు ఉండవు. వేల రూపాయలు ఖర్చుచేసి హెయిర్ ప్రోడక్టులను కొని వాడుతుంటారు. వాటివల్ల కొన్నిసార్లు మేలు జరగకపోగా.. హాని జరిగే అవకాశం ఉంది. అందుకే డాక్టర్లు, నిపుణులు జుట్టు పెరుగుదలకు సహజ పదార్థాలను ఉపయోగించాలని చెబుతుంటారు. నిపుణుల సూచనల ప్రకారం జుట్టు ఆరోగ్యానికి సహాయపడే కొన్ని చిట్కాలు మీకోసం.
26
గుడ్డు, నిమ్మరసం
గుడ్డులో నిమ్మరసం కలిపి వారానికి ఒకసారి జుట్టుకు రాస్తే అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. గుడ్డులో ఉండే సహజ ప్రోటీన్, విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్లు జుట్టును లోపలి నుంచి బలంగా చేస్తాయి. దానివల్ల జుట్టు రాలడం, విరిగిపోవడం తగ్గుతుంది. నిమ్మరసంలో ఉండే ఆమ్లత్వం తలపై ఉన్న ధూళి, ఆయిల్, చుండ్రును తగ్గించి స్కాల్ప్‌ను శుభ్రం చేస్తుంది.
36
ఆముదం నూనెతో తలపై మసాజ్
ఆముదం నూనెతో వారానికి ఒకసారి 30 నిమిషాల పాటు జుట్టుకు మసాజ్ చేస్తే రక్తప్రసరణ మెరుగవుతుంది. దానివల్ల జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషకాలు అందుతాయి. జుట్టు దృఢంగా, ఆరోగ్యంగా మారుతుంది. ఆముదం నూనెలో ఉండే సహజ ప్రోటీన్లు, ఫ్యాటీ యాసిడ్లు పొడిబారిన జుట్టుకు తేమను అందిస్తాయి.
ఆనియన్ జ్యూస్‌ను వారానికి రెండు సార్లు స్కాల్ప్‌పై సున్నితంగా మసాజ్ చేస్తే జుట్టుకు అనేక రకాలుగా మేలు జరుగుతుంది. ఉల్లిపాయ రసంలో ఉండే సల్ఫర్ తలపై చర్మంలో రక్తప్రసరణను పెంచి, జుట్టు కుదుళ్లను చురుకుగా మారుస్తుంది. అంతేకాదు కుదుళ్లకు అవసరమైన పోషకాలు సులభంగా అందడం వల్ల జుట్టు వేగంగా, దృఢంగా పెరుగుతుంది. ఉల్లిపాయ రసం యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. జుట్టు సహజంగా మెరుస్తుంది.
56
మెంతుల పేస్ట్, కొబ్బరినూనె
మెంతుల పేస్టులో కొబ్బరినూనె కలిపి వారానికి ఒకసారి జుట్టుకు రాయడం వల్ల జుట్టుకు మేలు జరుగుతుంది. మెంతుల్లో ఉండే ప్రోటీన్లు, నికోటినిక్ ఆమ్లం, లెసితిన్ వంటి పోషకాలు కుదుళ్లను బలపరచి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. కొబ్బరినూనెలో ఉన్న ఫ్యాటీ యాసిడ్లు జుట్టు చిట్లడాన్ని తగ్గిస్తాయి. మెంతులలోని సహజ యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ-డ్యాండ్రఫ్ లక్షణాలు స్కాల్ప్‌ను శుభ్రంగా ఉంచి చుండ్రు, దురద వంటి సమస్యలను తగ్గిస్తాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
66
అలోవెరా జెల్, తేనె
అలోవెరా జెల్, తేనె కలిపి వారానికి ఒకసారి జుట్టుకు రాయడం వల్ల జుట్టు బలంగా మారుతుంది. అలోవెరాలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఎంజైములు స్కాల్ప్‌ను శాంతింపజేసి దురద, ఇన్‌ఫ్లమేషన్, పొడిబారడం వంటి సమస్యలను తగ్గిస్తాయి. జుట్టు రూట్స్‌ను తేమగా ఉంచి ఆరోగ్యకరమైన పెరుగుదలకు సహాయపడతాయి. తేనెలోని సహజ గుణాలు జుట్టును తేమగా, సిల్కీగా ఉంచుతాయి.