Face Glow: ముఖం యవ్వనంగా మెరుస్తూ కనిపించాలా? ఈ రెండు కలిపి రాస్తే చాలు

Published : Nov 20, 2025, 04:34 PM IST

Face Glow: కొబ్బరి నూనెను దాదాపు అందరూ జుట్టు కోసం వాడతారు. కానీ, ఇదే కొబ్బరి నూనె చర్మ అందాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

PREV
13
Face Glow

మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ముఖం పై మొటిమలు, మచ్చలు రావడం చాలా సహజం. దానికి తోడు ఈ చలికాలంలో చర్మం చాలా తొందరగా పొడిబారుతుంది. దీని వల్ల ముఖం అందవిహీనంగా కనపడుతుంది. ఇలా స్కిన్ మారడానికి చాలా కారణాలు ఉన్నాయి. కాలుష్యం, మనం తినే ఆహారం, హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి ఇలా చాలా కారణాల వల్ల కూడా చర్మం దెబ్బతింటుంది. ఇలాంటి సమయంలో ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి కేవలం కొన్ని సహజ ఉత్పత్తులు వాడితే సరిపోతుంది.

కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, మాయిశ్చరైజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా కూడా మారుతుంది.

23
కొబ్బరి నూనె, పెరుగు ఫేస్ ప్యాక్...

పెరుగు చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా, అందులోని లాక్టిక్ యాసిడ్ వల్ల నల్ల మచ్చలు తగ్గేందుకు సహాయపడుతుంది. దీని కోసం... ఒక చెంచా పెరుగులో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి, ముఖానికి రాయాలి. 30 నిమిషాల తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. రెగ్యులర్ గా దీనిని వాడటం వల్ల.. ముఖం తాజాగా, మృదువుగా మారుతుంది. యవ్వనంగా కూడా కనపడుతుంది.

33
కొబ్బరి నూనె – దాల్చిన చెక్క ఫేస్ ప్యాక్

దాల్చిన చెక్కలో ఉన్న యాంటీసెప్టిక్ గుణాలు చర్మాన్ని పునరుత్తేజ పరుస్తాయి. పొడిబారిన చర్మం ఉన్నవారికి ఇది మంచి ఉపశమనం ఇస్తుంది. ఒక చెంచా దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా కొబ్బరి నూనె చుక్కలు వేసి మిశ్రమం చేయాలి. కావాలంటే కొంత తేనె కూడా కలుపుకోవచ్చు. ఈ పేస్ట్‌ను ముఖంపై 10 నిమిషాలు ఉంచి కడిగేస్తే చర్మానికి సహజ కాంతి వస్తుంది.

మీరు మొదటిసారి కొబ్బరి నూనెను ఫేస్‌పై ఉపయోగిస్తుంటే, ముందుగా చిన్న ప్యాచ్ టెస్ట్ చేయడం తప్పనిసరి. ఇది మీ చర్మానికి సూట్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories