Lip Care: చలికి పెదాలు పగిలి ఇబ్బంది పడుతున్నారా? ఇదొక్కటి చేస్తే చాలు..!

Published : Nov 21, 2025, 10:26 AM IST

 Lip Care: చలికాలంలో పెదాలు పగిలి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు కూడా అలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే.. కేవలం కొన్ని సింపుల్ రెమిడీలు ఫాలో అయితే సరిపోతుంది. 

PREV
15
పగిలిన పెదాలు

ముఖ సౌందర్యాన్ని పెంచడంలో పెదాలు కీలక పాత్ర పోషిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. పెదాలు మృదువుగా.. ఎర్రగా లేదా గులాబి రంగులో ఉంటే చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అందుకే... ప్రతి అమ్మాయి తమ పెదాలు ఎర్రగా ఉండాలని కోరుకుంటారు. అది సాధ్యం కాకపోవడం వల్ల రకరకాల లిప్ స్టిక్స్ పూసేస్తూ ఉంటారు. వాటి వాడకం ఎక్కువగా ఉండటం వల్ల మరింత నల్లగా మారతాయి. ఇక చలికాలం వచ్చింది అంటే ఈ పెదాలు తొందరగా పగిలిపోతూ ఉంటాయి. ఇలా పగులినప్పుడు ఒక్కోసారి రక్తస్రావం కూడా అవుతుంది. అలా కాకుండా, మీ పెదాలు లిప్స్ అందంగా కనిపించాలి అనుకుంటే... ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు. మరి, అవేంటో చూద్దాం...

25
1. పగిలిన పెదాలకు స్క్రబ్బింగ్...

మన చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి క్రమం తప్పకుండా స్క్రబ్బింగ్ ఎంత అవసరమో, మన పెదాల నుంచి డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడానికి క్రమం తప్పకుండా స్క్రైబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పెదాలు శుభ్రపడటమే కాదు..సహజంగా మెరుస్తూ కనపడతాయి. దీని కోసం మీరు మార్కెట్లో దొరికే ఉత్పత్తులు కొనాల్సిన అవసరం లేదు. కేవలం... తేనె, పంచదార ఉంటే చాలు. ఈ రెండింటినీ సమాన పరిమాణంలో తీసుకొని పెదాలకు రాయాలి. 10 నిమిషాలు అలానే వదిలేసి.. ఆరిపోయిన తర్వాత రుద్దాలి. ఇలా చేయడం డెడ్ స్కిన్ తొలగిపోతుంది. పెదాలు మృదువుగా మారతాయి.

35
పెదాలకు మసాజ్ చేయాలి....

చలికాలంలో మీ పెదాలు పొడిగా ఉంటే, రాత్రి పడుకునే ముందు స్వచ్ఛమైన కొబ్బరి నూనె లేదా ఆవు నెయ్యితో సున్నితంగా మసాజ్ చేయండి. ఈ మసాజ్ పెదవులలో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీని వల్ల మృదువుగా కనపడతాయి. ముఖ్యంగా నల్లటి పెదాలు ఉన్నవారు ప్రతిరోజూ రాత్రి కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వల్ల ఆ నలుపు తగ్గి.. ఎర్రగా మారతాయి. మీరు కావాలంటే.. జొజొబా లేదా ఆలివ్ ఆయిల్ తో అయినా మసాజ్ చేయవచ్చు.

45
నాణ్యమైన లిప్ బామ్ వాడటం...

చాలా మంది అమ్మాయిలు రాత్రిపూట ముఖానికి వేసిన మేకప్ తీస్తారు కానీ.. పెదాలకు రాసిన లిప్ స్టిక్ మాత్రం తుడవరు. ఆ తప్పు చేయకూడదు. దానిని పూర్తిగా తుడిచేసి.. దానికి మంచి నాణ్యమైన లిప్ బామ్ రాయాలి. ఇవి రాయడం ఇష్టం లేకపోతే ఆవు నెయ్యి అయినా రాయవచ్చు. దీని వల్ల పెదాలు ఎప్పుడూ మృదువుగా ఉంటాయి.

55
తగినంత నీరు త్రాగాలి.

వర్షాకాలంలో కూడా మీ పెదవులు పగిలిపోయి పొడిగా ఉంటే, దీనికి ప్రధాన కారణం డీహైడ్రేషన్ కావచ్చు. శరీరంలో తగినంత నీరు లేకపోవడమే పెదవులు పొడిబారడానికి ప్రధాన కారణం. అందువల్ల, రోజంతా పుష్కలంగా నీరు త్రాగడం , శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం ముఖ్యం. అలాగే, ధూమపానం మానేయడం చాలా ముఖ్యం. ధూమపానం వల్ల మీ పెదవులు నల్లగా మారతాయి. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. మీ పెదాలు అందంగా కనపడతాయి.

Read more Photos on
click me!

Recommended Stories