జిడ్డుగల చర్మానికి ఫేస్ ప్యాక్...
కావలసినవి: అరటిపండు, బొప్పాయి, కీర దోసకాయ
ఈ అరటి ఫేస్ ప్యాక్ బొప్పాయి, కీర దోసకాయ ,అరటిపండు మిశ్రమం జిడ్డు గల చర్మానికి అద్భుతంగా పనిచేస్తుంది. అరటిపండు, బొప్పాయి రెండూ కలిపిన మిశ్రమం ముఖానికి రాయడం వల్ల మీ చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇక కీరదోస చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీని వల్ల.. ముఖంలో తేజస్సు కనపడుతుంది. దీని కోసం.... 1/4 బొప్పాయి, 1/4 దోసకాయ , 1/2 అరటిపండు తురుముతో నునుపుగా పేస్ట్ చేయండి. పేస్ట్‌ను మీ ముఖం , మెడకు అప్లై చేసిన తర్వాత, 15 నిమిషాలు వేచి ఉండండి. ఆ తర్వాత, గోరువెచ్చని నీటితో బాగా కడగాలి.
యవ్వనంగా కనిపించడానికి....
యవ్వనంగా కనిపించడానికి మీరు పెరుగు, అరటి పండు మిశ్రమం వాడితే సరిపోతుంది. పెరుగులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు.. ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి, ముఖంపై ముడతలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అరటిపండులో లాక్టిక్ యాసిడ్ కూడా ఉంటుంది, ఇది చర్మం రంగు మెరుగుపడటానికి సహాయపడుతుంది. అరటి పండు, పెరుగు కలయిక కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా మార్చడానికి కూడా సహాయపడుతుంది. దీని కోసం.. ఒక గిన్నెలో సగం పండిన అరటిపండును 2 టేబుల్ స్పూన్ల పెరుగుతో కలిపి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం , మెడపై సమానంగా పూయాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.