పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మానికి అవసరమైన విటమిన్స్ అందుతాయి. ముఖ్యంగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న కీర, పుచ్చకాయ, దోసకాయ వంటి ఆహారాలు చర్మాన్ని చల్లగా ఉంచి నేచురల్ గ్లో ఇస్తాయి. ఫాస్ట్ ఫుడ్, ఆయిలీ ఫుడ్స్ తగ్గించడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి చర్మాన్ని మసకబారేలా చేస్తాయి.