అవకాడో నూనె...
వేసవిలో మీ జుట్టు బలహీనంగా, నిర్జీవంగా మారితే.. అవకాడో నూనె వాడటం బెస్ట్. ఈ నూనెలో విటమిన్ ఎ, బి, డి, ఈ పుష్కలంగా ఉంటాయి. ఈ నూనెలో కొవ్వు ఆమ్లాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఈ నూనె రాయడం వల్ల.. ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది. జుట్టు బాగా మెరుస్తూ కనపడుతుంది.
బాదం నూనె
బాదం నూనె తేలికగా ఉంటుంది. జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది. దీనిలో విటమిన్ ఇ, మెగ్నీషియం , ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి, ఇవి జుట్టును బలపరిచి, విరిగిపోకుండా నివారిస్తాయి. దీనిని వారానికి ఒకసారి ఉపయోగించడం ప్రయోజనకరం.
జోజోబా నూనె, ఆర్గాన్ నూనె
జోజోబా నూనె ముఖ్యంగా జిడ్డుగల తల చర్మానికి చాలా మంచిది. ఈ నూనెలు రాయడం వల్ల జుట్టు అందంగా మారుతుంది. ఈ నూనె వాడటం వల్ల కూడా చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. మీ జుట్టు చివర్లకు ఆర్గాన్ నూనెను రాయడం వల్ల జుట్టు చిక్కులు పడటం తగ్గుతుంది. జుట్టు మెరిసేలా చేస్తుంది.