బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్ , బ్లాక్బెర్రీస్ వంటి బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ఆంథోసైనిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి , ఫ్రీ రాడికల్ నష్టాన్ని ఎదుర్కోవడానికి సహాయపడతాయి. బెర్రీలలో అధిక విటమిన్ సి కంటెంట్ కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తి సరిగా ఉంటే.. మీ ముఖం యవ్వనంగా కనపడుతుంది.
ప్రతిరోజూ ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా, మీరు మీ చర్మాన్ని మాత్రమే కాకుండా మీ మొత్తం ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు.