Hair Care: మీరు వాడే షాంపూ మంచిదేనా? కెమికల్స్ ఉన్నాయో లేదో గుర్తించేదెలా?

Published : Oct 28, 2025, 11:39 AM IST

Hair Care:  వారానికి  ఐదుసార్లు తలస్నానం చేసేవాళ్లు మనలో చాలా మంది ఉంటారు. కానీ, మీరు వాడే షాంపూ అసలు మంచిదేనా? అందులో కెమికల్స్ ఉన్నాయా? అసలు రసాయనాలు లేని షాంపూని ఎలా ఎంచుకోవాలి?

PREV
15
Hair Care

హెయిర్ కేర్ రొటీన్ లో షాంపూ ఒక భాగం అయిపోయింది. మార్కెట్లో కూడా రకరకాల షాంపూలు ఉన్నాయి. ఎవరికి నచ్చిన దానిని వారు వాడుతూ ఉంటారు. కానీ, మీరు వాడే షాంపూ నిజంగా మంచిదేనా? ఎందుకంటే, ఈ రోజుల్లో దాదాపు అన్ని షాంపూల్లోనూ కెమికల్స్ ఎక్కువగా ఉంటున్నాయి. అలాంటి వాడటం వల్ల జుట్టు విపరీతంగా రాలడం, హెయిర్ డ్యామేజ్ అవ్వడం లాంటి సమస్యలు పెరగొచ్చు. మరి, మనం వాడే షాంపూ కెమికల్స్ ఉన్నాయో లేదో ఎలా గుర్తించాలి..? మంచి షాంపూ ఎలా ఎంచుకోవాలి? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...

25
షాంపూలో ఉండే కెమికల్స్...

ప్రస్తుతం మార్కెట్లో లభించే ఎక్కువ శాతం షాంపూలలో సోడియం లారిల్ సల్ఫేట్, సోడియం లారెత్ సల్ఫేట్ వంటి కెమికల్స్ ఉంటాయి. ఇవి జుట్టులో చాలా తొందరగా నురుగు వచ్చేలా చేస్తాయి. కానీ, అదే సమయంలో మన జుట్టులోని సహజ నూనెలను తొలగిస్తాయి. ఫలితంగా, జుట్టు పొడిబారుతుంది. తొందరగా తెగిపోతుంది. విపరీతంగా జుట్టు కూడా రాలుతుంది. కొందరికి అయితే... స్కిన్ అలెర్జీలు కూడా రావచ్చు.

35
మన పూర్వీకులు ఏం వాడేవారు..?

పురాతన కాలంలో మన పూర్వీకులు కుంకుడు కాయలు, మెంతులు, ఉసిరి, శికాకాయి వంటి సహజ పదార్థాలతో తల స్నానం చేసేవారు. ఇవి రసాయనాలు లేని సహజ క్లీనర్లు. ఈ పద్ధతులు జుట్టును బలంగా, మెరిసేలా ఉంచడమే కాకుండా, తల చర్మానికి పోషణ అందిస్తాయి. కానీ ప్రస్తుత కాలంలో ఇవి వాడటం కష్టమైపోయి... షాంపూల మీద ఆధారపడుతున్నారు.

45
కెమికల్ లేని షాంపూ ని గుర్తించేదెలా?

ఇటీవల సోషల్ మీడియాలో డాక్టర్ యోగా విద్య సూచించిన ఒక సులభమైన చిట్కా వైరల్ అవుతోంది. కేవలం చిటికెడు పసుపు ఉన్నా ఈ షాంపూ మంచిదో కాదో తెలుసుకోవచ్చు.

దీని కోసం మీరు ఒక చిన్న గిన్నెలో షాంపూని తీసుకోవాలి. దానికి కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి. కొద్ది సేపు ఆ గిన్నెను పక్కన పెట్టి ఉంచాలి. మరి కాసేపటి తర్వాత... ఆ షాంపూ అదే రంగులో, లేదంటే పసుపు రంగులో ఉంటే పర్వాలేదు. కానీ... ఎరుపు రంగులోకి మారింది అంటే.. అందులో కెమికల్స్ ఉన్నట్లే. ఇలాంటి షాంపూని వాడకపోవడమే మంచిది.

పసుపు ఒక సహజ రసాయన సూచిక (natural indicator). ఇది ఆమ్లాలు లేదా క్షారాల (acids & bases) తో కలిసినప్పుడు రంగు మారుతుంది. షాంపూలలో ఉన్న రసాయనాలు ఎక్కువగా క్షార స్వభావం కలిగి ఉండటంతో, పసుపు రంగు ఎరుపుగా మారుతుంది. ఈ ప్రక్రియ ఆధారంగా మనం రసాయనాల ఉనికిని సులభంగా గుర్తించవచ్చు.

55
మంచి షాంపూలను ఎంచుకునేదెలా?

మనం ఏ షాంపూ ఎంచుకున్నా.. సల్ఫేట్ లేని వాటిని మాత్రమే ఎంచుకోవాలి. సహజ పదార్థాలతో తయారైన హెర్బల్ లేదా ఆయుర్వేద బ్రాండ్లను ఎంచుకోవాలి. ఇలాంటి వాడటం వల్ల.... హెయిర్ డ్యామేజ్ ఎక్కువగా ఉండదు.

Read more Photos on
click me!

Recommended Stories