వర్షాకాలంలో రకరకాల చర్మ సమస్యలు వస్తాయి. ముఖం కాంతి తగ్గి.. నల్లగా, కళా విహీనంగా కనిపిస్తుంది. ఇక ఆయిల్ స్కిన్ ఉన్నవారి గురించి అయితే చెప్పనవసరం లేదు. మరి ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ సూపర్ ఫేస్ ప్యాక్ లు ట్రై చేయండి.
వర్షాకాలంలో చల్లని, తేమతో కూడిన వాతావరణం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చర్మ సమస్యలు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. అందుకు ఉపయోగపడే కొన్ని ఇంటి చిట్కాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
26
పసుపు, వేప ఫేస్ ప్యాక్ :
పసుపు సహజంగానే ముఖానికి అందాన్నిస్తుంది. వేపాకులో బాక్టీరియా, ఫంగస్ నిరోధక లక్షణాలు ఉండటం వల్ల వర్షాకాలంలో వచ్చే మొటిమలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. పసుపు, వేప ఫేస్ ప్యాక్ కోసం.. వేపాకులను బాగా కడిగి, వాటిలో కొద్దిగా పసుపు, నీళ్లు కలిపి పేస్ట్‌లా రుబ్బుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ముఖం కడిగితే సరిపోతుంది.
36
ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ :
ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మం ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముల్తానీ మట్టి చర్మం నుంచి అదనపు నూనెను పీల్చుకుని రంధ్రాలను తెరవడానికి సహాయపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన రోజ్ వాటర్ చర్మాన్ని చల్లబరుస్తుంది. ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ కోసం.. 2 స్పూన్ల ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి.. ముఖానికి రాసుకోవాలి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తర్వాత ముఖం కడిగితే సరిపోతుంది.
జిడ్డు చర్మం ఉన్నవారికి శనగపిండి, పెరుగు, పసుపు ఫేస్ ప్యాక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ రాత్రి పూట వేసుకోవడం మంచిది. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి 2 స్పూన్ల శనగపిండిలో ఒక స్పూన్ పెరుగు, చిటికెడు పసుపు కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని అరగంట తర్వాత కడిగేయాలి.
56
కలబంద జెల్, దోసకాయ ఫేస్ ప్యాక్ :
సెన్సిటివ్ చర్మం ఉన్నవారికి కలబంద జెల్, దోసకాయ ఫేస్ ప్యాక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కలబంద చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. దోసకాయ చర్మంలో పగుళ్లు రాకుండా చూస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి దోసకాయ రసంలో కలబంద జెల్ కలిపి ముఖానికి రాసుకోవాలి. 15-20 నిమిషాల తర్వాత కడిగిస్తే సరిపోతుంది.
66
చందనం, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ :
చందనంలో ఉండే క్రిమిసంహారక లక్షణాలు చర్మంపై దద్దుర్లు, మొటిమలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రోజ్ వాటర్ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. చందనం పొడిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకొని బాగా ఆరిన తర్వాత కడిగితే సరిపోతుంది.