Face Glow: ఓట్స్ లో ఇదొక్కటి కలిపి రాస్తే.. 15 నిమిషాల్లో ముఖం మెరిసిపోద్ది..!

Published : Aug 04, 2025, 05:26 PM IST

మీరు ఓట్స్ తో సహజంగా మీ అందాన్ని పెంచుకోవచ్చు. అయితే..కేవలం ఓట్స్ కాకుండా.. అందులో పెరుగు కూడా కలిపి ముఖానికి రాస్తే.. సహజంగా అందంగా మెరిసిపోతారు.

PREV
14
Naural face pack

ఏదైనా పండగలు, ఫంక్షన్లు, పెళ్లిళ్లు వచ్చాయి అంటే చాలు ఆ రోజున మహిళలు అందంగా మెరిసిపోవాలి అనుకుంటూ ఉంటారు. దానికోసం మార్కెట్లో దొరికే ఏవేవో క్రీములు కొనేసి ముఖానికి రాసేస్తూ ఉంటారు. అయితే..కేవలం ఓట్స్ వాడి మన అందాన్ని పెంచుకోవచ్చు. అదెలాగో.. ఇప్పుడు తెలుసుకుందాం...

మీరు ఓట్స్ తో సహజంగా మీ అందాన్ని పెంచుకోవచ్చు. అయితే..కేవలం ఓట్స్ కాకుండా.. అందులో పెరుగు కూడా కలిపి ముఖానికి రాస్తే.. సహజంగా అందంగా మెరిసిపోతారు. కేవలం 15 నిమిషాల్లోనే ముఖంలో గ్లో స్పష్టంగా కనపడుతుంది. తక్కువ సమయంలో అందంగా కనిపించాలి అనుకునేవారికి ఇది బెస్ట్ చాయిస్. మరి, ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి? దానిని ముఖానికి ఎలా వాడాలి అనే విషయం తెలుసుకుందాం...

24
ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి కావలసినవి-

పెరుగు

ఓట్స్

టీ ట్రీ ఆయిల్

పసుపు

ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి అంటే..?

పెరుగు . ఓట్స్‌తో ఫేస్ ప్యాక్ తయారుచేసే పద్ధతి చాలా సులభం. దీన్ని తయారు చేయడానికి, ముందుగా ఓట్స్‌ను బ్లెండర్ లో వేసి మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడికి కొంచెం పెరుగు , టీ ట్రీ ఆయిల్ జోడించండి. ఇప్పుడు దానిని కలిపి దానికి చిటికెడు పసుపు జోడించండి. ఈ పేస్ట్‌ను బాగా కొట్టి మీ ముఖం మీద 15 నిమిషాలు అప్లై చేయండి. ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకొని.. ఆ తర్వాత ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చాలు. మీ ఫేస్ లో తెలియని ఓ గ్లో వస్తుంది. ఫేషియల్స్ చేయించినప్పుడు వచ్చే అందం.. దీనితో మనకుల భిస్తుంది.

34
ఉపయోగాలు:

ఓట్స్ చర్మాన్ని నిగారింపజేస్తుంది, డెడ్ స్కిన్ ను తొలగిస్తుంది.

పెరుగు చర్మాన్ని మృదువుగా చేస్తుంది, టాన్ తొలగించడంలో సహాయపడుతుంది.

టీ ట్రీ ఆయిల్ యాంటీబాక్టీరియల్ గుణాలు కలిగి ఉండి మొటిమలు, చర్మ సమస్యలకు ఉపశమనం ఇస్తుంది.

పసుపు సహజమైన అంటురోగ నివారణ గుణాలతో మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఇలా చేస్తే మంచి ఫలితాలు:

వారంలో 2 సార్లు ఈ ఫేస్ ప్యాక్ వాడితే చర్మానికి సహజమైన మెరుపు కనిపిస్తుంది.

చర్మానికి తేమ అందిస్తుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. చాలా తక్కువ సమయంలో ఫేస్ లో మెరుపు వస్తుంది. వరసగా రెండు రోజులు వాడితో ఫేస్ లో మార్పు క్లియర్ గా కనపడుతుంది.

44
గమనిక:

ఈ ఫేస్ ప్యాక్ సాధారణంగా అన్నిరకాల చర్మాలకు అనువుగా ఉంటుంది. అయినప్పటికీ, ఒక చిన్న ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది – ఎందుకంటే కొంతమందికి టీ ట్రీ ఆయిల్ లేదా పసుపు మీద అలర్జీ ఉండొచ్చు. ఇది మంచి చిట్కా అయినప్పటికీ అందరికీ సూట్ అవ్వకపోవచ్చు.

ఇకపై పండగల కోసం ప్రత్యేకంగా పార్లర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే, ఇంటి గృహ పదార్థాలతో సహజంగా మెరిసిపోవచ్చు. ఇది తక్కువ ఖర్చుతో, ఎక్కువ ఫలితాలను అందించే నేచురల్ బ్యూటీ సీక్రెట్.

ఏదైనా ఉపయోగించే ముందు, ప్యాచ్ టెస్ట్ చేయండి ఎందుకంటే ఇది కొంతమంది అమ్మాయిల చర్మంపై ప్రతిచర్యకు కారణం కావచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories