Weight Loss Tips: ఈజీగా బరువు తగ్గాలనుకుంటున్నారా? బెస్ట్ చిట్కాలు ఇవే!

Published : Jul 23, 2025, 01:48 PM IST

అధిక బరువుతో బాధపడుతున్నారా? బరువును ఎలా నియంత్రించాలో తెలియడం లేదా? అయితే ఈ చిట్కాలు మీకోసమే. వీటితో  సులభంగా బరువు తగ్గవచ్చు. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.  

PREV
16
పొట్ట కొవ్వు తగ్గించే చిట్కాలు

నియంత్రణ లేని జీవనశైలి వల్ల శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోతుంది. నిరంతర పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లు ఈ సమస్యను మరింత పెంచుతాయి. మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ సులభమైన చిట్కాలు మీకోసం. ఓసారి ట్రై చేయండి. 

26
గోరువెచ్చని నీళ్లు..

శరీరంలో పేరుకుపోయిన కొవ్వును బయటకు పంపించడానికి ప్రతిరోజూ వివిధ రకాల డ్రింక్స్ తీసుకోవడం మంచిది. నిద్రలేచిన తర్వాత గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కొవ్వు కూడా త్వరగా కరుగుతుంది. 

36
కూరగాయలు..

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజు ఆకుకూరలు, కూరగాయలు తీసుకోండి. కొవ్వు, చక్కెర పదార్థాలు తక్కువగా తీసుకోండి. దానివల్ల క్రమంగా ప్రయోజనం పొందుతారు. నీరు కూడా తగినంత తాగడం మంచిది.  

46
మంచి నిద్ర

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, బరువును నియంత్రణలో ఉంచుకోవడానికి మంచి నిద్ర చాలా ముఖ్యం. ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి. తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. మంచి నిద్ర వల్ల హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి.  

56
వ్యాయామం

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వ్యాయామం తప్పనిసరి. ప్రతిరోజూ వ్యాయామం చేస్తే బరువు నియంత్రణలో ఉంటుంది. అదనపు కేలరీలు బర్న్ అవుతాయి. 

66
నిపుణుల సలహా..

బరువు తగ్గాలనుకునేవారు, ఆహారపు అలవాట్లను మార్చుకోవడానికి ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. 

Read more Photos on
click me!

Recommended Stories