మనం వంట కోసం రెగ్యులర్ గా పచ్చిమిర్చిని కట్ చేస్తూనే ఉంటాం. అయితే మిరపకాయలు కట్ చేసినప్పుడు చేతులు మండటం సహజం. కానీ కొన్ని చిట్కాలతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.
మనం పచ్చి మిర్చిని చాలా రకాల వంటల్లో వాడుతుంటాం. పచ్చి మిరపకాయల్లో 'క్యాప్సైసిన్' అనే సమ్మేళనం ఉంటుంది. మిర్చిని కోసేటప్పుడు కాప్సైసిన్ విడుదల అవుతుంది. ఇది చేతులకు తగలగానే మనకు మంటగా అనిపిస్తుంది. అంతేకాదు పచ్చిమిర్చి కోసిన చేతులను కళ్లు, ముక్కు వంటి సున్నితమైన భాగాల్లో తాకితే అక్కడ కూడా మంట వస్తుంది.
25
చేతులు మండకుండా ఉండే చిట్కాలు..
పచ్చిమిరపకాయల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్, పొటాషియం, ఐరన్ వంటివి ఉంటాయి. ఇవి శరీరాన్ని అనేక సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. అయితే పచ్చిమిర్చి కోసిన తర్వాత చేతులు మంటగా అనిపిస్తాయి. మరి ఆ మంట నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇక్కడ చూద్దాం.
35
నెయ్యి
మిరపకాయలు కట్ చేసిన తర్వాత మంటను నివారించాలనుకుంటే.. కట్ చేసే ముందు మీ చేతులకు నెయ్యి రాసుకోండి. ఎందుకంటే నెయ్యి ఒక పొరను ఏర్పరుస్తుంది. దానివల్ల క్యాప్సైసిన్ చర్మానికి నేరుగా తగలదు. తద్వారా మంటను నివారించవచ్చు.
మిరపకాయల వల్ల కలిగే మంటను తగ్గించడానికి.. మీ చేతులను చల్లటి నీటిలో ముంచండి. కావాలంటే చల్లటి నీటిలో కొద్దిగా ఉప్పు లేదా వెనిగర్ కూడా కలపవచ్చు. ఇవి మంటను తగ్గించడంలో సహాయపడతాయి.
బేకింగ్ సోడా :
బేకింగ్ సోడాను ఉపయోగించి మిరపకాయల వల్ల వచ్చే మంటను తగ్గించుకోవచ్చు. అందుకోసం బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి పేస్ట్ లా తయారు చేయాలి. దాన్ని చేతులకు రాసి ఆరిన తర్వాత సబ్బుతో కడిగేయాలి.
55
కత్తెర సాయంతో..
మిరపకాయలను కట్ చేసేటప్పుడు మంట అనిపిస్తే.. కత్తెర సహాయంతో పచ్చిమిరపకాయలను కట్ చేయవచ్చు. ఇది మిరపకాయలు మీ చేతులకు నేరుగా తగలకుండా చేస్తుంది.
చేతి తొడుగులు..
మిరపకాయలు కోసేటప్పుడు చేతి తొడుగులు ఉపయోగించడం మంచిది. మిర్చి కట్ చేసిన తర్వాత చేతులు కడగకుండా కళ్ల దగ్గర పెట్టుకోకూడదు. దానివల్ల కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.