Earwax Remove Tips: ఇలా చేస్తే.. చెవిలో గులిమి చిటికెలో శుభ్రం అవుతుంది!

Published : Jul 22, 2025, 02:44 PM IST

చెవిలో గులిమి పేరుకుపోవడం సాధారణ సమస్యే. కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం నొప్పి, దురద, వినికిడి సమస్యలు తప్పవు. మరి ఇయర్ వాక్స్ ని ఇంట్లోనే ఎలా శుభ్రం చేసుకోవాలో కొన్ని చిట్కాలు మీకోసం. ఓసారి ట్రై చేయండి.

PREV
16
ఇయర్ వాక్స్ తొలగించే చిట్కాలు

చాలామందికి చెవిలో గులిమి ఎక్కువగా పేరుకుపోతుంటుంది. దానివల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. నిజానికి చెవిలో ఉండే గులిమి దుమ్ము, ధూళి, బాక్టీరియా వంటివాటిని చెవిలోకి వెళ్లకుండా కాపాడుతుంది. అంతేకాదు చెవిలో ఇన్ఫెక్షన్ వంటివి రాకుండా సహాయపడుతుంది. అయితే గులిమి ఎక్కువైతే మాత్రం సమస్య తప్పదు. నొప్పి, దురద, వినికిడి వంటి సమస్యలు వస్తాయి. మరి ఇయర్ వాక్స్ ని ఇంట్లోనే ఎలా శుభ్రం చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.  

26
వెచ్చని కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె:

చెవిలో వెచ్చని కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె వేసుకోవడం చాలా ప్రభావవంతమైన పద్ధతి. ఇది చెవిలో గులిమి మెత్తబడేలా చేస్తుంది. దాంతో అది సులభంగా బయటకు వస్తుంది. దానికోసం చెవిలో ఒక చుక్క వెచ్చని నూనె వేసుకోవాలి. తలను కొన్ని నిమిషాలు ఒకవైపు వంచి ఉంచుకోవాలి. తర్వాత మరో చెవిలో కూడా ఒక చుక్క నూనె వేసుకోవాలి. 1-2 రోజులు లేదా కొన్ని గంటల తర్వాత గులిమి దానంతట అదే బయటకు వస్తుంది.

36
హైడ్రోజన్ పెరాక్సైడ్:

హైడ్రోజన్ పెరాక్సైడ్ చెవిలోని గులిమిని కరిగించడానికి సహాయపడుతుంది. దీన్ని ఏ మెడికల్ షాపులోనైనా కొనుక్కోవచ్చు. పావు టీస్పూన్ ద్రావణాన్ని పావు టీస్పూన్ నీటిలో కలపాలి. దాన్ని చెవిలో వేసుకుని తల ఒకవైపు వంచుకోవాలి. కొన్ని నిమిషాల్లోనే గులిమి బయటకు వస్తుంది.

46
వెచ్చని నీరు..

ఇయర్ వాక్స్ ఎక్కువగా ఉంటే వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం సురక్షితమైన మార్గం. దీనికోసం తల ఒకవైపు వంచుకొని, శుభ్రమైన రబ్బరు సిరంజిలో వెచ్చని నీరు తీసుకుని, నెమ్మదిగా చెవిలో వేసుకోవాలి. కొంతసేపు ఇలా చేస్తే.. చెవిలో గులిమి బయటకు వస్తుంది. అయితే ఈ పద్ధతిని ఉపయోగించే ముందు చెవిలో నూనె రాసుకోవడం మంచిది.

56
ఉప్పు నీరు..

 చెవిలో గులిమి సమస్య ఉంటే.. ఉప్పు, నీటి ద్రావణం కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అర కప్పు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ ఉప్పు కలిపి, దూదితో చెవిలో నెమ్మదిగా వేసుకోవాలి. తలను కొన్ని నిమిషాలు ఒకవైపు వంచి ఉంచుకోవాలి. తర్వాత శుభ్రమైన బట్టతో తుడుచుకోవాలి. ఇది చవకైన, సురక్షితమైన, ప్రభావవంతమైన పద్ధతి.

66
చెవి శుభ్రపరిచే పరికరాలు..

ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల చెవి శుభ్రపరిచే పరికరాలు దొరుకుతున్నాయి. వాటిని ఉపయోగించి ఎలాంటి నొప్పి లేదా ప్రమాదం లేకుండా చెవిలో గులిమిని తొలగించుకోవచ్చు. అయితే ఏ వస్తువునైనా చెవిలోకి లోతుగా పెట్టకూడదు. దానివల్ల చెవి పొరకు హాని కలిగే అవకాశం ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories