Today Vegetable Price : కూరగాయల సరఫరా పెరగడంతో మార్కెట్‌లో వాటి ధరలు బాగా తగ్గాయి. ముఖ్యంగా వంటల్లో ఎక్కువగా ఉపయోగించే టమాటా, ఉల్లిపాయల ధరలు తగ్గడంతో గృహిణులు సంతోషంగా పెద్ద మొత్తంలో కొంటున్నారు.
Vegetable Prices : వర్షకాలం ముగిసింది... దీంతో కూరగాయల ధరలు కూడా తగ్గుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి... దీంతో మార్కెట్లో వాటి సరఫరా తగ్గి డిమాండ్ పెరగడంతో ధరలు కూడా పెరిగాయి. కానీ ఇప్పుడు వర్షాలు తగ్గిపోయాయి... పొడి వాతావరణం ఉంటోంది. దీంతో కూరగాయలకు ఉత్పత్తి పెరిగింది... మార్కెట్ లోకి సరఫరా పెరగడంతో ధరలు తగ్గుతున్నాయి.
26
మీరు కూడా కూరగాయల సంతకు వెళుతున్నారా?
సాధారణంగా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో శనివారం లేదంటే ఆదివారం కూరగాయల సంతలు జరుగుతుంటాయి. ఈ రెండురోజులు ఉద్యోగులకు సెలవులు ఉంటాయి కాబట్టి మార్కెట్లలో రద్దీ ఉంటుంది... వారానికి సరిపడా కూరగాయాలు ఒకేసారి కొనుక్కుంటారు. ఇలా మీరుకూడా కూరగాయల మార్కెట్ కు వెళుతుంటే ఓసారి ఇక్కడ అందించే కూరగాయల ధరలు పరిశీలించండి... దీన్నిబట్టి మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో అవగాహన వస్తుంది.
36
హైదరాబాద్ లో టమాటా, ఉల్లి ధరలు ఎలా ఉన్నాయి?
వివిధ రాష్ట్రాల నుంచి లారీలకు లారీల కూరగాయలు మార్కెట్‌కు వస్తున్నాయి. అలాగే స్థానికంగా కూడా కూరగాయల దిగుబడి పెరిగింది. వంటలో ప్రధానంగా ఉపయోగించే టమాటా, ఉల్లిపాయలు డిమాండ్ కు మించి సరఫరా అవుతుండటంతో ధరలు తగ్గాయి. ఈ కారణంగా గృహిణులు పోటీపడి వీటిని కొనుగోలు చేస్తున్నారు.
హైదరాబాద్ మార్కెట్లో పెద్ద ఉల్లిపాయలు కిలో రూ. 20 నుంచి 25, చిన్న ఉల్లిపాయలు కిలో రూ. 35 నుండి 40 వరకు ఉన్నాయి. కొందరు వ్యాపారులు మంచి నాణ్యమైన ఉల్లిపాయలు రూ.100 కు మూడు నుండి నాలుగు కిలోలు ఇస్తున్నారు. ఇక టమాటా కిలో రూ. 20 నుంచి 25... ఎక్కువమొత్తంలో కొంటే రూ.50 కి మూడుకిలోలు, రూ.100 ఆరేడు కిలోలు కూడా ఇస్తున్నారు మరికొందరు కూరగాయాల వ్యాపారులు.
హైదరాబాద్ లోని వివిధ మార్కెట్లలో ఇతర కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. పచ్చిమిర్చి ధర కాస్త ఎక్కువగానే ఉంది... కిలో రూ.45-55 గా ఉంది. ఇక బీట్‌రూట్ కిలో రూ.40-44, బంగాళదుంప కిలో రూ.32-36 అమ్ముతున్నారు. అరటి పువ్వు కిలో రూ. 15, క్యాప్సికమ్ కిలో రూ. 48-55, కాకరకాయ కిలో రూ. 38-40, సొరకాయ కిలో రూ. 37-41, బటర్ బీన్స్ కిలో రూ. 70, చిక్కుడుకాయ కిలో రూ. 30కి విక్రయిస్తున్నారు వ్యాపారులు.
ఇక పాలకూర కిలో రూ.20-22, పూదీనా రూ.3-5 కట్ట, కరివేపాకు రూ.5-10 కట్ట, కొత్తిమీర రూ.10 కట్ట, మెంతి కూర కిలో రూ.15-20, చామకూర కిలో రూ.16-18 లభిస్తున్నాయి. అయితే ఈ కూరగాయాలు, ఆకుకూరల ధరలు సూపర్ మార్కెట్లు, షాపులు, రైతుబజార్లు, వారాంతం సంతలు జరిగే ఏరియాను బట్టి మారుతుంటాయి... ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.