ప్రపంచ ట్రామా దినోత్సవం సందర్భంగా, మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శ్రీచైతన్య ఐఐటీ క్యాంపస్, అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డా. దామోదర్ కాకుమాను, ట్రామా కేర్ బృందం విద్యార్థులు, ప్రజలకు రోడ్డు భద్రత, బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS), ప్రమాద సమయంలో చేయాల్సిన తక్షణ చర్యలు, రోగిని సురక్షితంగా ఆస్పత్రికి తరలించే పద్ధతులు గురించి వివరించారు.
ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు, ప్రయాణికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోడ్డు భద్రత, హెల్మెట్ వినియోగం, సీటు బెల్ట్ ప్రాముఖ్యతపై సమాచార బ్రోచర్లు, వివరణలతో కూడిన కరపత్రాలు పంపిణీ చేశారు.
సమాజంలో ప్రమాదాలపై అవగాహన పెంచడం, అత్యవసర వైద్య సేవలను బలోపేతం చేయడం లక్ష్యంగా మెడికవర్ హాస్పిటల్స్ నిరంతరం విద్యా, శిక్షణ, ప్రజా కార్యక్రమాలు చేపడుతోంది. హైటెక్ సిటీలో ప్రారంభించిన ఈ ట్రామా & ఆక్యూట్ సర్జరీ విభాగం, తెలుగు రాష్ట్రాల్లో అత్యవసర వైద్య సేవలకు కొత్త ప్రమాణంగా నిలుస్తుందని వైద్య నిపుణులు తెలిపారు.