తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. పరీక్షలు ఎప్పటి నుంచి అంటే?

Published : Nov 19, 2026, 05:15 PM IST

Telangana Inter Exam Timetable: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. 2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ పబ్లిక్ పరీక్షల టైమ్‌టేబుల్‌ను రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి విడుదల చేసింది.

PREV
15
ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం

బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు 2027 ఫిబ్రవరి 24న ప్రారంభమై మార్చి 19న ముగుస్తాయి. సెకండ్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 25న మొదలై మార్చి 20న పూర్తవుతాయి. థియరీ పరీక్షలన్నీ ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఈ షెడ్యూల్ జనరల్ కోర్సులతో పాటు వొకేషనల్ కోర్సులకూ వర్తిస్తుంది. అయితే వొకేషనల్ విద్యార్థుల కోసం ప్రత్యేక టైమ్‌టేబుల్‌ను బోర్డు విడిగా విడుదల చేయనుంది.

25
జనవరిలో ప్రాక్టికల్స్, ఇతర పరీక్షలు

థియరీ పరీక్షలకు ముందుగానే ప్రాక్టికల్, అంతర్గత మూల్యాంకన పరీక్షలు నిర్వహించనున్నారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు జనవరి 20 నుంచి 25 వరకు ఇంటర్నల్ అసెస్‌మెంట్ ఉంటుంది. జనవరి 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జరగనుంది. జనవరి 29న ఇదే సమయానికి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు జనవరి 29న, సెకండ్ ఇయర్ విద్యార్థులకు జనవరి 30న ఉంటాయి. సెకండ్ ఇయర్ సైన్స్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లు ఉంటాయి. ఆదివారాల్లోనూ పరీక్షలు నిర్వహించనున్నారు.

35
ఫస్ట్ ఇయర్ పరీక్షల పూర్తి వివరాలు

ఫస్ట్ ఇయర్ థియరీ పరీక్షలు ఫిబ్రవరి 24న సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1తో ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 26న ఇంగ్లీష్ పేపర్-1 పరీక్ష ఉంటుంది. మార్చి 2న మ్యాథమెటిక్స్ పేపర్-1A, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1తో పాటు ACE గ్రూప్ విద్యార్థులకు అకౌంటెన్సీ పేపర్-1 నిర్వహిస్తారు.

మార్చి 5న మ్యాథమెటిక్స్ పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1, ACE గ్రూప్ కామర్స్ పేపర్-1 పరీక్షలు జరుగుతాయి. మార్చి 9న ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1 ఉంటాయి. మార్చి 15న కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ అండ్ అకౌంటెన్సీ పేపర్-1 పరీక్షలు నిర్వహిస్తారు.

మార్చి 17న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, MEC గ్రూప్ మ్యాథమెటిక్స్ పేపర్-1 పరీక్షలు ఉంటాయి. చివరిగా మార్చి 19న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1, బైపీసీ విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-1 పరీక్ష నిర్వహించడంతో ఫస్ట్ ఇయర్ పరీక్షలు ముగుస్తాయి.

45
సెకండ్ ఇయర్ పరీక్షల పూర్తి షెడ్యూల్

సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఫిబ్రవరి 25న సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2తో పరీక్షలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 27న ఇంగ్లీష్ పేపర్-2 పరీక్ష ఉంటుంది. మార్చి 3న మ్యాథమెటిక్స్ పేపర్-2A, బోటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తారు.

మార్చి 8న మ్యాథమెటిక్స్ పేపర్-2B, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2 పరీక్షలు ఉంటాయి. మార్చి 12న ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2 పరీక్షలు జరగనున్నాయి. మార్చి 16న కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ అండ్ అకౌంటెన్సీ పేపర్-2 నిర్వహిస్తారు.

మార్చి 18న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2 పరీక్ష ఉంటుంది. చివరి రోజైన మార్చి 20న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2, బైపీసీ విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-2 నిర్వహిస్తారు. దీంతో సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు పూర్తవుతాయి.

55
ఫస్ట్ ఇయర్ సైన్స్ ప్రాక్టికల్స్‌కు ప్రత్యేక విధానం

ఫస్ట్ ఇయర్ సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 11 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ఆదివారం కూడా జరుగుతాయి. ఒక్కో సెషన్ రెండు గంటల పాటు ఉంటుంది. రోజుకు మూడు సెషన్ల చొప్పున ప్రాక్టికల్స్ నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు. విద్యార్థులు తమ గ్రూపులు, సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలను ముందుగానే గుర్తుంచుకుని చదువుపై దృష్టి పెట్టాలి. ప్రస్తుతం విడుదల చేసింది తాత్కాలిక టైమ్‌టేబుల్ కావడంతో తుది షెడ్యూల్‌లో మార్పులు ఉంటే ఇంటర్ బోర్డు అధికారిక ప్రకటనలను అనుసరించాలి. హాల్‌టికెట్లు, పరీక్షల నిర్వహణకు సంబంధించిన తాజా సూచనల కోసం బోర్డు సమాచారాన్ని గమనిస్తూ ఉండాలి.

Read more Photos on
click me!

Recommended Stories