బంజారాహిల్స్ ఎప్పటి నుంచో హైదరాబాద్‌లో ఖరీదైన షాపింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. ముఖ్యంగా రోడ్ నంబర్ 1, రోడ్ నంబర్ 2, రోడ్ నంబర్ 12లలో డిజైనర్ బోటిక్‌లు, ప్రీమియం ఫ్యాషన్ లేబుల్స్, జ్యువెలరీ షోరూమ్‌లు, లైఫ్‌స్టైల్ స్టోర్స్ ఎక్కువగా ఉన్నాయి. లగ్జరీ అవుట్‌లెట్స్, కేఫ్‌లు, రెస్టారెంట్లతో ఈ ప్రాంతం ఒక పెద్ద లైఫ్‌స్టైల్ హబ్‌గా మారింది.
మరోవైపు జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 36, రోడ్ నంబర్ 45 ప్రాంతాలు మోడ్రన్ రిటైల్ షాపింగ్‌కు అడ్డాగా మారాయి. డిజైనర్ స్టూడియోలు, బ్యూటీ, వెల్‌నెస్, హోమ్ డెకర్ అవుట్‌లెట్స్, ఖరీదైన బ్రాండ్లు, కేఫ్‌లు ఇక్కడ యూత్‌ను, షాపింగ్ ప్రియులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఇక హిమాయత్‌నగర్ విషయానికి వస్తే.. ఇది పూర్తిగా భిన్నమైన షాపింగ్ అనుభూతిని ఇస్తుంది. వెస్ట్ హైదరాబాద్‌లోని లగ్జరీ ఏరియాలకు భిన్నంగా, హిమాయత్‌నగర్ ఒక సందడిగా ఉండే హై స్ట్రీట్. ఇక్కడ బట్టలు, నగలు, చెప్పులు, పుస్తకాలు, ఎలక్ట్రానిక్స్ షాపులతో పాటు ఫుడ్ స్పాట్స్ కూడా ఎక్కువే. అన్ని రకాల బడ్జెట్లలో షాపింగ్ చేసే ఫ్యామిలీలకు ఇది ఎప్పటి నుంచో ఫేవరెట్ హబ్‌గా కొనసాగుతోంది.