హిందువులకు కార్తీకమాసం చాలా ప్రత్యేకమైనది... ఇది శివకేశవులు (శివుడు, విష్ణువు) ఇద్దరికీ ఇష్టమైన నెలగా పేర్కొంటారు. అందుకే ఇటు శివభక్తులు, అటు విష్ణు భక్తులు ఈ మాసంలో భక్తిశ్రద్దలతో పూజలు చేస్తుంటారు... దేవాలయాలు కిటకిటలాడుతుంటాయి. అంతేకాదు చాలామంది మహిళలు ఈ నెలలోనే తులసిపూజలు చేస్తుంటారు.
కార్తీక దీపాలు వెలిగించడం, కార్తీక స్నానాలు చేయడం, కుటుంబసభ్యులంతా కార్తీక వనభోజనాలకు వెళ్లడం... ఇలా నెలరోజులు పండగ వాతావరణం ఉంటుంది. అయితే కార్తీకమాసం అంతా ఒకెత్తు, కార్తీక పౌర్ణమి ఇంకో ఎత్తు... ఈరోజు మరింత పవిత్రమైందిగా భావిస్తారు. అందుకే చాలామంది ఈరోజే పూజలు, వ్రతాలు, దీపారాధన, నదీస్నానాలు చేస్తుంటారు.
అయితే ప్రతిసారి కార్తీక పౌర్ణమికి తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు ఓ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈరోజు సెలవు ఉంటుందా, ఉండదా? అని... ఈసారి కూడా ఇది కొనసాగుతోంది. మరి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో కార్తీక పౌర్ణమికి సెలవు ఉందో, లేదో తెలుసుకుందాం.