ఆ ఐదు పార్లమెంట్ స్థానాల్లో గెలుపే టార్గెట్: తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యూహం

First Published | Dec 22, 2023, 11:16 AM IST

పార్లమెంట్ ఎన్నికలపై  తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫోకస్ పెంచారు.  తెలంగాణలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలపై కేంద్రీకరించింది. 

ఆ ఐదు పార్లమెంట్ స్థానాల్లో గెలుపే టార్గెట్: తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యూహం

తెలంగాణ రాష్ట్రంలోని ఐదు పార్లమెంట్ స్ధానాల్లో  విజయం కోసం  కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది.  2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికలను తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 

also read:పదేళ్లకు ఒకే వేదికపై బాబు, పవన్:ఆంధ్రప్రదేశ్‌లో 2014 రిజల్ట్స్ వస్తాయా?

ఆ ఐదు పార్లమెంట్ స్థానాల్లో గెలుపే టార్గెట్: తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యూహం

2023 అసెంబ్లీ ఎన్నికల్లో  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది.  వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికల్లో  తెలంగాణ రాష్ట్రం నుండి మెజారిటీ స్థానాలను  కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహంతో ముందుకు వెళ్తుంది. 

also read:తెలంగాణపై బీజేపీ ఫోకస్: ఎంపీ టిక్కెట్ల కోసం బీజేపీ నేతల మధ్య పోటా పోటీ


ఆ ఐదు పార్లమెంట్ స్థానాల్లో గెలుపే టార్గెట్: తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యూహం

2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ మూడు ఎంపీ స్థానాలను దక్కించుకుంది. ఈ దఫా  తెలంగాణలో కనీసం  రెండంకెల స్థానాల్లో విజయం సాధించాలనే వ్యూహంతో ముందుకు వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీకి  భారతీయ జనతా పార్టీతో ముప్పు పొంచి ఉంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై  భారతీయ జనతా పార్టీ కూడ ఫోకస్  పెట్టింది. 

also read:వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్: 10 సర్వేలతోనే ఇంచార్జీల మార్పులు

ఆ ఐదు పార్లమెంట్ స్థానాల్లో గెలుపే టార్గెట్: తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యూహం

తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్, హైద్రాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లపై   కాంగ్రెస్ మరింతగా ఫోకస్ పెట్టింది.  గత పార్లమెంట్ ఎన్నికల్లో  సికింద్రాబాద్,  ఆదిలాబాద్,  కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో  భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.  ఈ స్థానాల్లో  మరోసారి సిట్టింగ్ ఎంపీలనే  భారతీయ జనతా పార్టీ  బరిలోకి దింపే అవకాశం ఉంది.  మరో వైపు  హైద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో  ఎంఐఎం  అభ్యర్ధి అసదుద్దీన్ ఓవైసీ విజయం సాధిస్తూ వస్తున్నారు.  ఈ ఐదు స్థానాల్లో   విజయం కాంగ్రెస్ పార్టీకి  నల్లేరు మీద నడక కాదు.

also read:పోగోట్టుకొన్నచోటే:పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్, ఎంపీలతో ముఖాముఖి

  also read తెలంగాణ నుండి పోటీ: సోనియా కోసం ఆ మూడు స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్

ఆ ఐదు పార్లమెంట్ స్థానాల్లో గెలుపే టార్గెట్: తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యూహం

తెలంగాణ రాష్ట్రంలో  తొలిసారిగా  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.  అయితే  వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో  మెజారిటీ స్థానాలను దక్కించుకొనేందుకు  కాంగ్రెస్ పార్టీ వ్యూహత్మక అడుగులు వేస్తుంది.  

also read:తెలంగాణలో 12 ఎంపీ స్థానాలపై బీజేపీ ఫోకస్:కాంగ్రెస్‌కు చెక్ పెట్టేనా?

ఆ ఐదు పార్లమెంట్ స్థానాల్లో గెలుపే టార్గెట్: తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యూహం

రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమించారు. చేవేళ్ల, మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాలకు  తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి,   మెదక్ పార్లమెంట్ స్థానానికి  దామోదర రాజనర్సింహ, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి తుమ్మల నాగేశ్వరరావు, సికింద్రాబాద్  , హైద్రాబాద్ పార్లమెంట్ స్థానాలకు మల్లు భట్టి విక్రమార్క,  భువనగిరి పార్లమెంట్ స్థానానికి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,  నాగర్ కర్నూల్ స్థానానికి  జూపల్లి కృష్ణారావు,  నల్గొండ పార్లమెంట్ స్థానానికి  ఉత్తమ్ కుమార్ రెడ్డి,  వరంగల్ పార్లమెంట్ స్థానానికి  కొండా సురేఖ, మహబూబాబాద్,  , ఖమ్మం పార్లమెంట్ స్థానాలకు  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ కు పొన్నం ప్రభాకర్ లను  కాంగ్రెస్ పార్టీ నియమించింది.

also read:దక్షిణాదిపై బీజేపీ ఫోకస్: తెలంగాణలో నరేంద్ర మోడీ పోటీ, ఆ స్థానం ఏదంటే?

ఆ ఐదు పార్లమెంట్ స్థానాల్లో గెలుపే టార్గెట్: తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యూహం

తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎంపీ సీట్లను దక్కించుకోవాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ నుండి సోనియా గాంధీని పోటీ చేయాలని ఆ పార్టీ తెలంగాణ నేతలు  కోరుతున్నారు.ఈ మేరకు  తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ తీర్మానం చేసింది.

also read:హైద్రాబాద్‌లో శీతాకాల విడిది: సంప్రదాయానికి తెరతీసింది తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్

ఆ ఐదు పార్లమెంట్ స్థానాల్లో గెలుపే టార్గెట్: తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యూహం

తెలంగాణ నుండి  సోనియా గాంధీ పోటీ చేస్తే తెలంగాణతో పాటు  దక్షిణాదిపై  ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.  సోనియా గాంధీని మెదక్ , మల్కాజిగిరి లేదా కరీంనగర్ పార్లమెంట్ స్థానాల నుండి పోటీ చేయించాలని కాంగ్రెస్ నేతలు  భావిస్తున్నారు. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ నుండి సోనియా గాంధీ పోటీ చేస్తే ఈ ప్రాంతంలో బీజేపీ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు దోహదపడుతుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.

also read:1980 లో మెదక్‌‌లో ఇందిరా విజయం: తెలంగాణ నుండి సోనియా పోటీ చేస్తుందా?

ఆ ఐదు పార్లమెంట్ స్థానాల్లో గెలుపే టార్గెట్: తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యూహం

మరోవైపు హైద్రాబాద్ పార్లమెంట్ స్థానంపై  కూడ  కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది.అసెంబ్లీ ఎన్నికల్లో  జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సీట్లను గెలుచుకోలేకపోయింది.  కానీ ఓట్లు పెంచుకొంది. దరిమిలా హైద్రాబాద్ పై  సీఎం అనుముల రేవంత్ రెడ్డి ఫోకస్ పెంచారు.  హైద్రాబాద్, సికింద్రాబాద్, చేవేళ్ల,మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో విజయానికి  అవసరమైన మార్గాలపై  ఆ పార్టీ కేంద్రీకరించింది.

also read:నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?

ఆ ఐదు పార్లమెంట్ స్థానాల్లో గెలుపే టార్గెట్: తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యూహం

నిజామాబాద్, ఆదిలాబాద్,  పార్లమెంట్ స్థానాలపై కూడ ఆ పార్టో ఫోకస్ పెంచింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో  మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు  భారత రాష్ట్ర సమితిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.  2014, 2019 లో నిజామాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్ధి  మధు యాష్కీ విజయం సాధించారు. మధు యాష్కీ ఎల్ బీ నగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 

also read:పాలనపై పట్టుకు ఒక్కో అడుగు: స్వంత టీమ్‌తో రేవంత్

ఆ ఐదు పార్లమెంట్ స్థానాల్లో గెలుపే టార్గెట్: తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యూహం

నిజామాబాద్ అర్బన్ నుండి  పోటీ చేసిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడ ఓడిపోయాడు.  నిజామాబాద్ పార్లమెంట్ లో  విజయం కోసం  కాంగ్రెస్ వ్యూహరచన చేస్తుంది. ఆదిలాబాద్ లో  బీజేపీని దెబ్బతీసి  ఈ స్థానంలో  విజయం కోసం  కాంగ్రెస్  పార్టీ  ఫోకస్ పెంచింది.

also read:వైఎస్ఆర్‌సీపీ అసెంబ్లీ ఇంచార్జీల మార్పు: జగన్ స్కెచ్ ఇదీ..

Latest Videos

click me!