తెలంగాణపై బీజేపీ ఫోకస్: ఎంపీ టిక్కెట్ల కోసం బీజేపీ నేతల మధ్య పోటా పోటీ

First Published | Dec 20, 2023, 6:16 PM IST

2024 పార్లమెంట్ ఎన్నికలపై  భారతీయ జనతా పార్టీ  ఫోకస్ పెట్టింది.  తెలంగాణ రాష్ట్రం నుండి మెజారిటీ ఎంపీ సీట్లను కైవసం చేసుకోవాలనే వ్యూహంతో బీజేపీ ముందుకు సాగుతుంది.  

తెలంగాణపై బీజేపీ ఫోకస్: ఎంపీ టిక్కెట్ల కోసం బీజేపీ నేతల మధ్య పోటా పోటీ

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  ఎనిమిది స్థానాలను  భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. దీంతో  2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఫోకస్ పెట్టింది.  వచ్చే ఎన్నికల్లో  తెలంగాణ రాష్ట్రం నుండి  అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని  బీజేపీ  ప్లాన్ చేస్తుంది.

తెలంగాణపై బీజేపీ ఫోకస్: ఎంపీ టిక్కెట్ల కోసం బీజేపీ నేతల మధ్య పోటా పోటీ

2024 పార్లమెంట్ ఎన్నికల్లో  బీజేపీ  ఒంటరిగా పోటీ  చేయాలని నిర్ణయం తీసుకుంది.   2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుండి  నాలుగు ఎంపీ స్థానాల్లో  బీజేపీ విజయం సాధించింది. 2024 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుండి  కనీసం  12 ఎంపీ స్థానాల్లో విజయం సాధించాలని  బీజేపీ  భావిస్తుంది.  ఈ మేరకు ఈ 12 ఎంపీ స్థానాలపై  ఆ పార్టీ ఫోకస్ ను పెట్టింది. గత ఎన్నికల్లో విజయం సాధించిన  నాలుగు ఎంపీ స్థానాలతో పాటు  మరో ఎనిమిది ఎంపీ స్థానాలను కైవసం చేసుకొనే వ్యూహంతో  బీజేపీ ముందుకు వెళ్తుంది. 

తెలంగాణపై బీజేపీ ఫోకస్: ఎంపీ టిక్కెట్ల కోసం బీజేపీ నేతల మధ్య పోటా పోటీ

గత ఎన్నికల్లో  రాష్ట్రం నుండి విజయం సాధించిన నలుగురు ఎంపీల్లో ముగ్గురు  ఈ ఏడాది నవంబర్ మాసంలో జరిగిన  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే  ఈ ఎన్నికల్లో ముగ్గురు ఎంపీలు ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఈ నాలుగు పార్లమెంట్ స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలు మరోసారి బరిలోకి దిగే అవకాశం ఉంది. సికింద్రాబాద్ నుండి కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి,  ఆదిలాబాద్ నుండి సోయం బాపురావు,  కరీంనగర్ నుండి బండి సంజయ్,  నిజామాబాద్ నుండి ధర్మపురి అరవింద్ బరిలోకి దిగే అవకాశం ఉంది. 

తెలంగాణపై బీజేపీ ఫోకస్: ఎంపీ టిక్కెట్ల కోసం బీజేపీ నేతల మధ్య పోటా పోటీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీకి  7 శాతం ఓట్లు వచ్చాయి. ఏడు శాతం ఓట్లతో  8 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఓటింగ్ ను  కనీసం 20 శాతానికి పెంచుకోవాలని  బీజేపీ వ్యూహంతో ముందుకు వెళ్తుంది.

తెలంగాణపై బీజేపీ ఫోకస్: ఎంపీ టిక్కెట్ల కోసం బీజేపీ నేతల మధ్య పోటా పోటీ

తెలంగాణ నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని పోటీ చేయాలని కూడ బీజేపీ రాష్ట్ర నాయకత్వం కోరిందని  ప్రచారం సాగుతుంది.  ఒకవేళ అదే జరిగితే తెలంగాణలో  బీజేపీకి  రాజకీయంగా ప్రయోజనం కలిగే అవకాశం ఉందనే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
 
తెలంగాణపై బీజేపీ ఫోకస్: ఎంపీ టిక్కెట్ల కోసం బీజేపీ నేతల మధ్య పోటా పోటీ

మెదక్  పార్లమెంట్ స్థానం నుండి  దుబ్బాక మాజీ ఎమ్మెల్యే  రఘునందన్ రావు పోటీ చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. కరీంనగర్ నుండి  బండి సంజయ్ తో పాటు మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడ  పోటీకి ఆసక్తిని చూపుతున్నారని  ప్రచారం సాగుతుంది.  కరీంనగర్ నుండి  పార్టీ నాయకత్వం  అనుమతివ్వకపోతే మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసేందుకు  ఈటల రాజేందర్ ఆసక్తిగా ఉన్నారని  ప్రచారం సాగుతుంది.

తెలంగాణపై బీజేపీ ఫోకస్: ఎంపీ టిక్కెట్ల కోసం బీజేపీ నేతల మధ్య పోటా పోటీ

మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి  బీజేపీ పార్టీ అగ్రనేత మురళీధర్ రావు , మాజీ ఎమ్మెల్సీ  రామచంద్రరావు, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కూడ పోటీకి సిద్దంగా ఉన్నారు. ఆదిలాబాద్ ఎంపీ స్థానంలో పోటీకి  సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుతో పాటు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కూడ  పోటీ పడుతున్నారు.

తెలంగాణపై బీజేపీ ఫోకస్: ఎంపీ టిక్కెట్ల కోసం బీజేపీ నేతల మధ్య పోటా పోటీ

భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్  పోటీకి ఆసక్తిగా ఉన్నారు. 2014లో  ఇదే స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా బూర నర్సయ్యగౌడ్  ప్రాతినిథ్యం వహించారు. 2019 ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో బూర నర్సయ్య గౌడ్ ఓటమి పాలయ్యారు. 2022 చివర్లో జరిగిన  మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలో  బూర నర్సయ్య గౌడ్ బీఆర్ఎస్ ను వీడి  భారతీయ జనతా పార్టీలో చేరారు.   ఇదే స్థానం నుండి  పోటీకి గూడూరు నారాయణ రెడ్డి, శ్యాం సుందర్ కూడ  ఆసక్తిగా ఉన్నారు.

తెలంగాణపై బీజేపీ ఫోకస్: ఎంపీ టిక్కెట్ల కోసం బీజేపీ నేతల మధ్య పోటా పోటీ

నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు  పోటీకి ఆసక్తిని చూపుతున్నారు. సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుండి సంకినేని వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.
 
తెలంగాణపై బీజేపీ ఫోకస్: ఎంపీ టిక్కెట్ల కోసం బీజేపీ నేతల మధ్య పోటా పోటీ

హైద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి భగవంత రావు, రాజాసింగ్ ఆసక్తిగా ఉన్నారు.  పార్టీ అనుమతిస్తే హైద్రాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాల్లో పోటీకి రాజాసింగ్ ఆసక్తిగా ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది. జహీరాబాద్ నుండి  చీకోటి ప్రవీణ్ కుమార్, ఆశోక్ ముస్తాపురే పోటీకి సిద్దంగా ఉన్నట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.

తెలంగాణపై బీజేపీ ఫోకస్: ఎంపీ టిక్కెట్ల కోసం బీజేపీ నేతల మధ్య పోటా పోటీ

మహబూబ్ నగర్ నుండి మాజీ ఎంపీ ఏ.పీ. జితేందర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి డి.కె. అరుణ, ఆచారి ఆసక్తిగా ఉన్నారు.  మహబూబాబాద్ నుండి హుస్సేన్ నాయక్, రామచంద్రు నాయక్ పోటీ చేయాలని చూస్తున్నారు.  నాగర్ కర్నూల్ నుండి  బంగారు శృతి బరిలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు.ఖమ్మం నుండి పొంగులేటి సుధాకర్ రెడ్డి,పెద్దపల్లి నుండి పి. సుధాకర్ ఆసక్తిని చూపుతున్నారు.చేవేళ్ల నుండి కొండా విశ్వేశ్వర్ రెడ్డి  పోటీ చేసే అవకాశం ఉంది.

Latest Videos

click me!