తెలంగాణ నుండి పోటీ: సోనియా కోసం ఆ మూడు స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్

First Published | Dec 21, 2023, 4:40 PM IST

తెలంగాణ నుండి సోనియా గాంధీ పోటీ చేసేందుకు మూడు పార్లమెంట్ స్థానాలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెంచింది.

తెలంగాణ నుండి పోటీ: సోనియా కోసం ఆ మూడు స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్

తెలంగాణ రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీని  పోటీ చేయించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ నెల  18న జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో తెలంగాణ నుండి సోనియా గాంధీ పోటీ చేయాలని తీర్మానం చేశారు

also read:పదేళ్లకు ఒకే వేదికపై బాబు, పవన్:ఆంధ్రప్రదేశ్‌లో 2014 రిజల్ట్స్ వస్తాయా?

తెలంగాణ నుండి పోటీ: సోనియా కోసం ఆ మూడు స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్

ఈ తీర్మానం కాపీని  రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అందించారు. తెలంగాణ నుండి సోనియా గాంధీ పోటీ చేస్తే రానున్న రోజుల్లో   కాంగ్రెస్ కు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ  నేతలు అభిప్రాయపడుతున్నారు. 

also read:జగదీష్ రెడ్డి సవాల్, రేవంత్ సై: ఛత్తీస్ ఘడ్... భద్రాద్రి, యాద్రాద్రి పవర్ ప్లాంట్లపై జ్యుడీషియల్ విచారణ

also read:


తెలంగాణ నుండి పోటీ: సోనియా కోసం ఆ మూడు స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్

తెలంగాణ రాష్ట్రంలోని  17 పార్లమెంట్ స్థానాల్లో  మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని  కాంగ్రెస్ వ్యూహంతో ముందుకు వెళ్తుంది.  ఈ క్రమంలోనే తెలంగాణ నుండి సోనియా గాంధీ  పోటీ చేయాలని  ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. 

also read:తెలంగాణపై బీజేపీ ఫోకస్: ఎంపీ టిక్కెట్ల కోసం బీజేపీ నేతల మధ్య పోటా పోటీ
 

తెలంగాణ నుండి పోటీ: సోనియా కోసం ఆ మూడు స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్


తెలంగాణ రాష్ట్రంలోని మెదక్, మల్కాజిగిరి,  కరీంనగర్ పార్లమెంట్ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుండి  సోనియా గాంధీని పోటీ చేయాలని  కాంగ్రెస్ పార్టీ నేతలు  కోరుతున్నారు.  ఈ మేరకు ఈ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో  కాంగ్రెస్ నేతలు  వ్యూహరచన చేస్తున్నారు.

also read:వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్: 10 సర్వేలతోనే ఇంచార్జీల మార్పులు
 

తెలంగాణ నుండి పోటీ: సోనియా కోసం ఆ మూడు స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెదక్ పార్లమెంట్ స్థానంలో  1980లో  ఇందిరా గాంధీ పోటీ చేసి విజయం సాధించారు. మెదక్ లో గతంలో ఇందిరా గాంధీ పోటీ చేసినందున ఇదే స్థానం నుండి పోటీ చేయాలని  కోరుతున్నారు. మరో వైపు  మల్కాజిగిరి  పార్లమెంట్ నియోజకవర్గం నుండి  కూడ  సోనియా గాంధీ పోటీ చేయాలని కూడ ఆ పార్టీ నేతలు కోరుతున్నారు.

also read:పోగోట్టుకొన్నచోటే:పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్, ఎంపీలతో ముఖాముఖి

తెలంగాణ నుండి పోటీ: సోనియా కోసం ఆ మూడు స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో  గత ఎన్నికల్లో అనుముల రేవంత్ రెడ్డి  విజయం సాధించారు.  మినీ ఇండియా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఉంటుంది. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వారు ఈ నియోజకవర్గంలో  నివసిస్తున్నారు. 

also read:తెలంగాణలో 12 ఎంపీ స్థానాలపై బీజేపీ ఫోకస్:కాంగ్రెస్‌కు చెక్ పెట్టేనా?

also read:

తెలంగాణ నుండి పోటీ: సోనియా కోసం ఆ మూడు స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్

ఇక కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో కూడ సోనియా గాంధీని పోటీ చేయాలని కూడ  ఆపార్టీ నేతలు కోరుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  భారత రాష్ట్ర సమితి (తెలంగాణ రాష్ట్ర సమితి) తో 2004లో  కాంగ్రెస్  పొత్తు పెట్టుకుంది. ఆ సమయంలో కరీంనగర్ లో నిర్వహించిన సభలో  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని అప్పట్లో సోనియా గాంధీ ప్రకటించారు.  2014 ఎన్నికలకు ముందు పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ చేయించడంలో  యూపీఏ చైర్ పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ కీలకంగా వ్యవహరించారు. 

also read:దక్షిణాదిపై బీజేపీ ఫోకస్: తెలంగాణలో నరేంద్ర మోడీ పోటీ, ఆ స్థానం ఏదంటే?

తెలంగాణ నుండి పోటీ: సోనియా కోసం ఆ మూడు స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్


తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు కావస్తుంది. 2023 నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో  కరీంనగర్ పార్లమెంట్ స్థానంనుండి  కూడ  సోనియా గాంధీని పోటీ చేయాలని  స్థానిక నేతలు కోరుతున్నారు. 

also read:1980 లో మెదక్‌‌లో ఇందిరా విజయం: తెలంగాణ నుండి సోనియా పోటీ చేస్తుందా?

తెలంగాణ నుండి పోటీ: సోనియా కోసం ఆ మూడు స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్

ఉత్తర తెలంగాణలో  భారతీయ జనతా పార్టీ ప్రభావం కన్పించింది.  ఇటీవల జరిగిన  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  భారతీయ జనతా పార్టీ  ఎమ్మెల్యేలు  ఎక్కువగా ఉత్తర తెలంగాణ నుండి విజయం సాధించారు. కరీంనగర్ నుండి సోనియా గాంధీ పోటీ చేస్తే  ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రభావాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుందని  కూడ  కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.  ఈ వ్యూహంతోనే కాంగ్రెస్ నేతలు  కరీంనగర్ నుండి సోనియాను పోటీ చేయించాలనే యోచనతో ఉన్నారు.

also read:నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?

తెలంగాణ నుండి పోటీ: సోనియా కోసం ఆ మూడు స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్

దక్షిణాది నుండి ఎక్కువ ఎంపీ స్థానాలను కైవసం చేసుకొనే వ్యూహంలో భాగంగా నరేంద్ర మోడీని తెలగాణ నుండి పోటీ చేయాలని  బీజేపీ నేతలు  కోరారని ప్రచారం సాగుతుంది. మోడీ దక్షిణాది నుండి పోటీ చేస్తే కాంగ్రెస్ కు రాజకీయంగా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఈ తరుణంలో  సోనియా గాంధీని  తెలంగాణ నుండి పోటీ చేయించడం ద్వారా  దక్షిణాది నుండి మరిన్ని ఎక్కువ ఎంపీ సీట్లను గెలుచుకొనేలా  వ్యూహంతో ముందుకు వెళ్లొచ్చని  కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. 

also read:Year Ender 2023:టాప్ 10 బ్యాట్స్ మెన్స్ వీరే

Latest Videos

click me!