ఏంటీ.. నవీన్ యాదవ్‌పై ఇన్ని కేసులున్నాయా.? ఇప్పుడు వాటి ప‌రిస్థితి ఏంటంటే..

Published : Nov 14, 2025, 02:47 PM IST

Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో భారీ విజ‌యంతో న‌వీన్ యాద‌వ్ త‌న స‌త్తా చాటారు. ఏకంగా 25 వేల మెజారిటీతో గెలిచి స‌రికొత్త చ‌రిత్ర సృష్టించారు. ఈ నేప‌థ్యంలో న‌వీన్ యాద‌వ్‌పై ఉన్న కొన్ని కేసుల వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
మొదటి నుంచి ఆధిక్యం

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ (Naveen Yadav) జయకేతనం ఎగురవేశారు. 25 వేల ఓట్లకుపైగా మెజార్టీతో విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచే నవీన్ యాదవ్ తన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రౌండ్‌ రౌండ్‌కూ ఆధిక్యత పెరుగుతూ పోయింది. దీంతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ సరికొత్త చరిత్ర సృష్టించారు.

25
న‌వీన్ యాద‌వ్‌పై కేసులు

ఎన్నికల అఫిడవిట్ ప్రకారం నవీన్ యాదవ్‌పై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. లంచం, ఎన్నికల ప్రభావం, బెదిరింపు, మోసం వంటి ఆరోపణలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. ఇవి మధురా నగర్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి.

ఎన్నికల లంచం, ప్రభావం కేసు

Representation of the People Act, 1951 – సెక్షన్ 123(1), 123(2)

BNS సెక్షన్లు – 170, 171, 174

FIR 655/2025 – మధురా నగర్ PS

బెదిరింపు కేసు

IPC 506

జూబ్లీహిల్స్ PS

35
పాత కేసులు

2006లో న‌వీన్ యాద‌వ్‌పై కొన్ని కేసులు ఉన్నాయి. వీటిలో..

క్రైం నం. 395/2006 – జూబ్లీహిల్స్ PS

క్లాసిక్ మోసం, నమ్మకద్రోహం కేసు.

వర్తించిన సెక్షన్లు:

IPC 406 – నమ్మక ద్రోహం

IPC 420 – మోసం

IPC 506 – బెదిరింపు

ఈ కేసులో ఇప్పటికీ సమన్లు అందలేదు.

45
2021లో వరుస కేసులు

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో న‌వీన్ యాదవ్‌పై 2021లో వరుసగా కేసులు నమోదయ్యాయి:

FIR 575/2021 – ప్రేరేపణ, అపోహలు, బెదిరింపు

చార్జ్‌షీట్: 26 నవంబర్ 2021

FIR 340/2021 – చొరబాటు, మోసం, నకిలీ పత్రాలు, ఆస్తి నష్టం

పెండింగ్ విచారణ

FIR 95/2021 – బెదిరింపు

చార్జ్‌షీట్: 12 జనవరి 2022

FIR 93/2021 – మోసం, బెదిరింపు

చార్జ్‌షీట్: 1 సెప్టెంబర్ 2021

FIR 55/2021 – బలవంతపు అడ్డగింత, బెదిరింపు

చార్జ్‌షీట్: 30 జూన్ 2021

కేసుల ప్రస్తుత స్థితి విషయానికొస్తే.. ఒక కేసు ఇంకా దర్యాప్తులో ఉంది. మిగతా కేసులు కోర్టు దశలో ఉన్నాయి లేదా చార్జ్‌షీట్ దశలో పూర్తి అయ్యాయి.

55
అవన్నీ తప్పుడు కేసులే..

అయితే ఈ కేసులన్నీ తప్పుడివే అని నవీన్ యాదవ్ అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికకు ముందు తన మీద పెట్టిన కేసులు నిజమైతే తాను రాజకీయాలని వదిలి.. హైదరాబాద్ విడిచి వెళ్లిపోతానని ఛాలెంజ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో తనపై ఒకే ఏడాదిలో 20 వరకు తప్పులు కేసులు పెట్టిందని ఆరోపించారు. తనకు న్యాయవ్యవస్థ నమ్మకం కలిగించిందని.. తనను కాపాడిందని ఉద్ఘాటించారు.

Read more Photos on
click me!

Recommended Stories